సరికొత్తగా..సమస్త సమాచారంతో Telangana Health Bulletin

  • Published By: madhu ,Published On : July 26, 2020 / 12:49 PM IST
సరికొత్తగా..సమస్త సమాచారంతో Telangana Health Bulletin

Updated On : July 26, 2020 / 1:02 PM IST

తెలంగాణలో కరోనా కేసులు ఆగడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు రికార్డువుతున్నాయి. ప్రభుత్వం ప్రతి రోజు విడుదల చేసే హెల్త్ బులెటిన్ 2020, జులై 25వ తేదీ శనివారం విడుదల చేయలేదు.

కొత్తగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్త సమచారం ప్రజలకు తెలియచేస్తూ…2020, జులై 26వ తేదీ ఆదివారం (శనివారం కేసులు) విడుదల చేసింది.

శనివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 15 వందల 93 పాజిటివ్ కేసులు నమోదయినట్లు వెల్లడించింది. మొత్తంగా 54 వేల 059 వరకు చేరాయి. 8 మంది చనిపోయారని, రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 463 మందికి చేరింది.

కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 41 వేల 332కి చేరుకుంది. పలు ఆసుపత్రుల్లో 12 వేల 264 మంది చికిత్స పొందుతున్నారు. మరణాల రేటు 0.86 శాతంగా ఉంది. శనివారం 15 వేల 654 మంది నమూనాలు పరిశీలిస్తే…1593 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపింది.

జీహెచ్‌ఎంసీ 640. రంగారెడ్డి 171. వరంగల్‌ అర్బన్‌ 131. మేడ్చల్‌ జిల్లాలో 91. కరీంనగర్‌ జిల్లాలో 51. నాగర్‌కర్నూల్‌ 46. ఆదిలాబాద్‌ 14. భద్రాద్రిలో 17. జగిత్యాల 2. జనగామ 21. భూపాలపల్లిలో 3. జోగులాంబ గద్వాల 5. కామారెడ్డి 36. ఖమ్మం 18. మహబూబ్‌నగర్‌ 38. మహబుబాబాద్‌ 29. మంచిర్యాల 27. మెదక్‌ 21. ములుగు 12. నల్లగొండ 6. నారాయణపేట 7. నిర్మల్‌ 1. నిజామాబాద్‌ 32. పెద్దపల్లి 16. సిరిసిల్ల 27. సంగారెడ్డి 61. సిద్దిపేట 5. సూర్యాపేట 22. వికారాబాద్‌ 9. వనపర్తిలో 1. వరంగల్‌ రూరల్‌లో 21. యాదాద్రి భువనగిరి 11. పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

Gandhi Hospital :-
గాంధీ ఆస్ప్రతిలో మొత్తం బెడ్లు 1,890 ఉన్నాయి. ఈ ఆస్పత్రిలో 815 మంది కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. ICU లో 123 మంది, ఆక్సిజన్‌ వార్డులో 433, మిగతా వార్డుల్లో 259 మంది చికిత్స పొందుతున్నారు. గాంధీలో ఇంకా 1,075 పడకలు ఖాళీగా ఉన్నాయి.

17 వేల పడకలు : –
కరోనా బాధితుల కోసం 17 వేల పడకలు అందుబాటులో ఉన్నాయి. 11,928 ఐసోలేషన్‌ పడకలు, 3,537 ఆక్సిజన్‌ పడకలు, 1,616 ఐసీయూ పడకలున్నాయి. ఐసోలేషన్‌ వార్డుల్లో 627, ఆక్సిజన్‌ పడకల్లో 1,190, ఐసీయూ బెడ్లలో 317 మంది చికిత్స పొందుతున్నారు. మిగతా బెడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. 1,117 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి.