Election Commission: అవాంతరాలు లేకుండా ఎన్నికల నిర్వహణకు.. ఐసీసీఆర్ ను ఏర్పాటు చేసిన ఈసీ
తెలంగాణలో ఎన్నికలను పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ కేంద్రీకృత సమాచార వ్యవస్థ అవసరమని భావించిన ఈసీ..

Election Commissio
Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు అంచనా వేసి, వాటిని పరిష్కరించేందుకు హైదరాబాద్ ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ (ICCR) ను ఏర్పాటు చేసింది. ఎన్నికల నిర్వహణ, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు అవాంతరాలు లేకుండా ఈ కంట్రోల్ రూం ద్వారా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోనుంది.
తెలంగాణలో ఎన్నికలను పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ కేంద్రీకృత సమాచార వ్యవస్థ అవసరమని భావించిన ఈసీ.. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ బీఆర్కే భవన్‌లోని ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ICCR.. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిరంతరం పనిచేస్తుంది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలలోని మొత్తం 35 వేల 655 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులను ఈ కంట్రోల్ రూమ్ ద్వారా తెలుసుకునే అవకాశముంది. స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ నేతృత్వంలోని బృందాలు ఎప్పటికప్పుడు అన్ని విషయాలను సమన్వయం చేసుకుంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి వివరాలను అందజేస్తాయి. ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే తనిఖీలు, స్వాధీనం చేసుకునే సొత్తు, కోడ్ ఉల్లంఘనల నుంచి 1950 కాల్ సెంటర్, సీ-విజిల్ యాప్ కు అందే ఫిర్యాదుల వివరాలను ఈ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తారు. అలాగే ప్రకటనల ద్వారా మీడియాలో జరిగే ఉల్లంఘనలు, నిఘాల బృందాల సమన్వయం, సువిధ యాప్ అనుమతుల వంటి విషయాలను కూడా ఇక్కడి నుంచే మానిటరింగ్ చేస్తారు.
Also Read : Cyclone Mythili : తీరందాటిన మిథిలి.. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం
రాష్ట్రంలోని 15 శాటిలైట్ టీవీలు, మూడు యూట్యూబ్ ఛానళ్లను ఈ కంట్రోల్ రూమ్‌లో నిరంతరం పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్‌తో పాటు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఉన్న కంట్రోల్ రూమ్స్ అన్నీ ICCRకు అనుంధానమై ఉంటాయి. అలాగే.. ఎన్నికల ప్రక్రియలో భాగమైన లైవ్ వెబ్ కాస్టింగ్, సీసీ టీవీ కెమెరాలు, వీడియో గ్రాఫింగ్ వంటివన్నీ కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేశారు.