Minister KTR : తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష.. 29న దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహిస్తాం

రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ 2014 నుంచి నిరుద్యోగిగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

Minister KTR : తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష.. 29న దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహిస్తాం

Minister KTR

Telangana Assembly Elections 2023 : తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణపై ప్రకటన చేసిందని, ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 29న దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహిస్తామని కేటీఆర్ అన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడివారు అక్కడే దీక్షా దివస్ ను నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ, ఇతర సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. కాంగ్రెస్ నేతలపైనే ఐటీ దాడులు జరుతున్నాయనేది అవాస్తవం అని కేటీఆర్ అన్నారు.

Also Read : Revanth Reddy : పదేళ్ల కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం.. స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

కర్ణాటకలో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ అయినా విడుదల చేశారా? దమ్ముంటే సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. కర్ణాటకలో కేవలం హామీలు మాత్రమే ఇచ్చి వాటి అమల్లో కాంగ్రెస్ చేతులెత్తేసిందని మంత్రి అన్నారు. దేశంలో ఈ పదేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం లేదని అన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా60వేల ఉద్యోగాలు ఇచ్చిందని కేటీఆర్ అన్నారు.

Also Read : Kollywood : తమిళ పరిశ్రమలో ఏం జరుగుతుంది.. సినీ నిర్మాణ వివాదంలో సూర్య, కార్తీ.. సముద్రఖని ఆగ్రహం..

రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ 2014 నుంచి నిరుద్యోగిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఉద్యోగం చేసిన వ్యక్తి కాదు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నదీ లేదు. నేను పరీక్ష రాశా.. ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యా.. ఉద్యోగమూ చేశా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదని కేటీఆర్ విమర్శించారు. రైతుల ఖాతాల్లో రైతు బంధు పైసలు వేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు ఆగమవుతున్నడని కేటీఆర్ ప్రశ్నించారు. కర్ణాటకలో హామీల అమల్లో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయిందన్నారు.

గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని, బీజేపీపై కాంగ్రెస్ కు ఎంత ప్రేమఉందో అర్థమవుతోందని అన్నారు.  గోషామహల్ అభ్యర్థిని ఓడిస్తామని, బీజేపీని నిలువరించే శక్తి కేవలం బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని తెలిపారు. ఐటీ దాడులు కేవలం కాంగ్రెస్ అభ్యర్థులపైనే జరుగుతున్నాయని అనడంలో వాస్తవం లేదని, బీఆర్ఎస్ నాయకులపైనా దాడులు జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.