Jogi Ramesh : తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ మంత్రి జోగి రమేశ్ ప్రశంసల వర్షం.. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్న మంత్రి
Jogi Ramesh : తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. ఏపీలోనూ ఇలాంటివి ఏర్పాటు చేసే విధంగా ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి..

Jogi Ramesh(Photo : Google)
Jogi Ramesh-Neera : ఏపీ మంత్రి జోగి రమేశ్ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ప్రశంసించారు. కేసీఆర్ సర్కార్ మంచి నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గౌడ జాతి ఔనత్యాన్ని పెంచారని మంత్రి జోగి రమేశ్ అన్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఏపీ మంత్రి జోగి రమేశ్, హీరో సుమన్, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హైదరాబాద్ లోని నీరా కేఫ్ ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవతలు తాగిన ఔషధం నీరా అని మంత్రి జోగి రమేశ్ అన్నారు. గౌడ జాతి ఔనత్యాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పెంచారని ఆయన కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. నీరాని ప్రమోట్ చేసి ఔనత్యం పెంచారని కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటివి ఏర్పాటు చేసే విధంగా ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు మంత్రి జోగి రమేశ్.(Jogi Ramesh)
మంత్రి శ్రీనివాస్ గౌడ్..
నీరా ఒక ఔషధం. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పలు పరిశోధనల్లో శాస్త్రీయంగా నిరూపితమైంది. కొంతమంది నీరాపై దుష్ప్రచారం చేస్తున్నారు. చేతి వృత్తుల వారిని తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకుంటోంది. గీత వృత్తి కార్మికుల కోసం నీరా కేఫ్ ని అందుబాటులోకి తీసుకొచ్చాం.
సుమన్, సినీ నటుడు..
చాలా హార్డ్ వర్క్ చేసి ఈ నీరా కేఫ్ ని ఏర్పాటు చేశారు. నీరా అంటే చీప్ డ్రింక్ కాదు. ప్రతి ఒక్కరూ నీరా తాగొచ్చు. డయాబెటిస్ పేషెంట్లకు చాలా మంచిది. కెమికల్ డ్రింక్స్ అందరూ తాగుతున్నారు. హెల్త్ అందరికీ బాగుండాలని కోరుకుంటున్నా. నీరా కేఫ్ ను ఆదర్శంగా తీసుకుని దేశం మొత్తం పెట్టాలి.(Jogi Ramesh)
హైదరాబాద్ నగరం నడిబొడ్డున నెక్లెస్ రోడ్డులో ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా నీరా కేఫ్‌ను ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయల ఖర్చుతో స్టార్ హోటల్ రేంజ్ లో ఈ నీరా కేఫ్ ను కట్టారు. ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు జోగి రాజీవ్ మంగళవారం నీరా కేఫ్ ను సందర్శించారు. ప్రకృతి సిద్ధమైన, స్వచ్ఛమైన నీరాను ప్రజలకు అందిస్తున్నారని.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు మంత్రి జోగి రమేశ్.(Jogi Ramesh)
నీరా కేఫ్‌ను సందర్శనకు వచ్చిన మంత్రి జోగి రమేశ్ కు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనస్వాగతం పలికారు. నీరా కేఫ్‌లో లభ్యమవుతున్న ఉత్పత్తుల గురించి వివరించారు.
Also Read..Hyderabad Neera Cafe : స్టార్ హోటల్ని తలపించేలా నీరా కేఫ్ .. ప్రత్యేకతలేంటో తెలుసా..?
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గారు మరియు ప్రముఖ నటుడు సుమన్ గార్లతో కలిసి సందర్శించడం జరిగింది. pic.twitter.com/vqMkcHXPDO
— V Srinivas Goud (@VSrinivasGoud) May 16, 2023