Neera Cafe: ఏమిటీ నీరా?.. స్టార్‌ హోటల్‌ను తలపించేలా ఇన్ని కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్‌లో ఎందుకు కట్టారు?

Neera Cafe: కల్లుకి, నీరాకి తేడా ఏంటీ? నీరాలో పోషక విలువలు ఉన్నాయా?

Neera Cafe: ఏమిటీ నీరా?.. స్టార్‌ హోటల్‌ను తలపించేలా ఇన్ని కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్‌లో ఎందుకు కట్టారు?

Neera Cafe

Updated On : May 2, 2023 / 8:49 PM IST

Neera Cafe: హైదరాబాద్‌లో రూ.12.20 కోట్లు ఖర్చు చేసి కట్టిన నీరా కేఫ్‌ను తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ బుధవారం ప్రారంభిస్తున్నారు. నెక్లెస్‌రోడ్‌లోని నీరా కేఫ్‌ ఎన్నో ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంది. దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తీరు అబ్బురపరుస్తోంది. గౌడ కులస్థులకు మరింత ఉపాధి కల్పించడానికి సర్కారు నీరా కేఫ్‌లను ప్రారంభిస్తోన్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ లోనే కాకుండా భువనగిరిలోని నందనం వద్ద, అలాగే, రంగారెడ్డి జిల్లాలోని ముద్విన్‌, సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి, నల్గొండలోని సర్వేల్‌ లోనూ నీరా కేఫ్ లను ప్రారంభించనున్నారు. వీటికి కూడా సర్కారు ఇప్పటికే రూ.8 కోట్లు కేటాయించింది. నీరా కోసం గీత కార్మికులను శిక్షణ కూడా ఇప్పిస్తోంది.

కల్లుకి, నీరాకి తేడా ఏంటీ?
తాటి చెట్ల నుంచి వచ్చే కల్లును చాలా మంది తాగుతుంటారు. కల్లు తాగితే మత్తు ఎక్కుతుంది. నీరా అలా కాదు. నీరాను కూడా తాటి చెట్లతో పాటు ఈత చెట్ల నుంచి తీస్తారు. ఇది కల్లులాగే కనపడుతుంది. అయితే, కల్లు, నీరా వేర్వేరు. నీరా తాగితే మత్తు ఎక్కదు. తాటి, ఈత చెట్ల నుంచి కల్లు వస్తుందన్న విషయం అందరికీ తెలుసు.

కల్లుగా మారకముందు ఆ ద్రావణం ముందు నీరాగా ఉంటుంది. నీరా పులిసిపోయి చివరకు కల్లుగా మారుతుంది. చెట్టు నుంచి ముందుగా వచ్చే నీరాను కల్లుగా మారకముందే తీసి ఈ నీరా కేఫ్ లలో అమ్ముతారు.

Neera Cafe


Neera Cafe

నీరాలో పోషక విలువలు
కల్లు తాగితే ఊగిపోతాం కానీ, నీరా తాగితే అటువంటి మత్తు ఎక్కదు. ఈ ప్రయోజనమే కాకుండా నీరా తాగితే ఎన్నో పోషకాలు అందుతాయి. ఎన్నో ఆరోగ్య గుణాలున్నాయి కాబట్టే ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తోంది. సూర్యోదయం కాకముందే చెట్టు నుంచి దీన్ని తీస్తారు. అది పులిసిపోయి కల్లుగా మారకుండా జాగ్రత్తపడతారు. నీరాను శాస్త్రీయ పద్ధతిలోనే నిల్వచేస్తున్నారు.

నీరాను ఓ ఎనర్జీ డ్రింక్‌ గా చెప్పుకోవచ్చు. గ్యాస్‌ సమస్యతో పాటు మలబద్ధకం తగ్గుతుంది. కంటి చూపునకు మంచిదని అంటున్నారు. కాలేయ సంబంధిత వ్యాధులకూ పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లతో బాధపడేవారికీ మంచిది. నీరాలో సహజ సిద్ధమైన తీపి ఉంటుంది. సుక్రోస్‌, ప్రొటీన్స్‌ ఉంటాయి. ప్రో బయోటిక్స్‌ కూడా లభిస్తాయి. ఆయుర్వేదంలోనూ నీరాను వాడుతుంటారు.

NTR : ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్.. శత జయంతి ఉత్సవాలకు పూర్తిగా దూరం..