TGSRTC Strike: ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..! కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం..!
కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తక్షణమే ఒకటి లేదా రెండు డీఏల చెల్లింపునకు ఓకే చెప్పింది ప్రభుత్వం.
TGSRTC Strike: తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం అయినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన పలు డిమాండ్లకు సర్కార్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తక్షణమే ఒకటి లేదా రెండు డీఏల చెల్లింపునకు ఓకే చెప్పింది ప్రభుత్వం. మరోవైపు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై హైలెవల్ కమిటీ నియమించే అవకాశం ఉంది. ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు 12 గంటల పాటు కొనసాగాయి. మంత్రుల కమిటీ, జేఏసీ నేతల మధ్య 32 డిమాండ్లపై చర్చలు జరిగాయి. ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ చర్చల్లో దశాబ్దాల విలీన సమస్యకు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది. సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అటు, నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సంతాపం తెలిపారు మంత్రులు.
