MLA Rajasingh : వార్డ్ ఆఫీసుల పేరుతో తెలంగాణ సర్కార్ షో పుటప్ : ఎమ్మెల్యే రాజాసింగ్
కార్మికుల కొరత వలన గోషామహల్ నియోజకవర్గంలో రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే ఉంటోందని విమర్శించారు. కార్మికుల సంఖ్యను పెంచకుంటే శానిటేషన్ సమస్య ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.

Rajasingh
Rajasingh Fire TS Govt : తెలంగాణ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు చేశారు. వార్డ్ ఆఫీసుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం షో పుటప్ చేస్తోందని ఎద్దేవా చేశారు. పది రోజుల తర్వాత వార్డ్ ఆఫీసుల్లో ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. శుక్రవారం వీపీజీ గ్రౌండ్స్ లో వార్డ్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజసింగ్ పాల్గొని, మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల కొరత వలన గోషామహల్ నియోజకవర్గంలో రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే ఉంటోందని విమర్శించారు. కార్మికుల సంఖ్యను పెంచకుంటే శానిటేషన్ సమస్య ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. సిటీలో మంత్రులు తలసాని, మహమూద్ అలీలు శానిటేషన్ సమస్యపై దృష్టి పెట్టాలని తెలిపారు.
City Bus QR Code : సిటీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్… క్యాష్ తోపాటు క్యాష్ లెస్ టికెట్ విధానం
వార్డ్ ఆఫీసులతో షో పుటప్ కాకుండా.. ప్రాక్టికల్ గా ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవటంతో గోషామహల్ లో రూ.15కోట్ల విలువైన సీసీ రోడ్ల పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు.