Junior Doctors Strike : జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం!

తమ డిమాండ్లు తీర్చాలని సమ్మెలోకి వెళ్లిన జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సమ్మె విరమణపై 2021, మే 27వ తేదీ గురువారం సాయంత్రం జూడాలు ఓ ప్రకటన చేయనున్నారు.

Junior Doctors Strike : జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం!

Junior Doctors

Updated On : May 27, 2021 / 2:42 PM IST

Telangana Govt And Junior Doctors : తమ డిమాండ్లు తీర్చాలని సమ్మెలోకి వెళ్లిన జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సమ్మె విరమణపై 2021, మే 27వ తేదీ గురువారం సాయంత్రం జూడాలు ఓ ప్రకటన చేయనున్నారు. ప్యానెల్ తో మొత్తం డిస్కషన్ చేసి ఓ నిర్ణయం తీసుకుంటామని జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు వెల్లడించారు.

జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె చేయడం భావ్యం కాదని ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా..జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో డీఎంఈ చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కాలేదు. 2021, మే 27వ తేదీ హెల్త్ సెక్రటరీ రిజ్వీ విఆర్కే భవన్ లో జూడాలతో చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం అయ్యాయి. అయితే..ఎక్స్ గ్రేషియా విషయంలో టెక్నికల్ అంశం ఉందని..దీనిపై చర్చించిన తర్వాత..జూడాలకు నచ్చచెప్పారు. దీనిపై కోర్ కమిటీలో చర్చించి ఓ నిర్ణయం ప్రకటిస్తామని జూడాల ప్రతినిధులు వెల్లడించారు.

Read More : Black Fungus : ఇల్లు అమ్మేసి బ్లాక్ ఫంగస్ చికిత్స..ఐదు నెల‌ల్లో ఆరు ఆపరేషన్లు..రూ.55లక్షలకు పైగా ఖర్చు..