Justice Thottathil Passed Away: తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ కన్నుమూత

రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యేక హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి. 2019 జనవరిలో తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా అప్పటి గవర్నర్ నర్సింహన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

Justice Thottathil Passed Away: తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ కన్నుమూత

Justice Thottathil Passed Away

Updated On : April 3, 2023 / 10:34 AM IST

Justice Thottathil Passed Away: తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్ జడ్జి తొట్టతిల్ బి. రాధాకృష్ణన్ (63) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా రాధాకృష్ణన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేరళ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కోల్‌కత్తా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. దీంతోపాటు రాధాకృష్ణన్ కేరళ లీగల్ సర్వీసెస్ అథారిటీకి తాత్కాలిక చైర్మన్ గా కూడా ఉన్నారు.

TS high court: విశ్వ విద్యాలయాల్లో రాజకీయాలా? ఓయూ రిజిస్ట్రార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యేక హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి. 2019 జనవరిలో తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా అప్పటి గవర్నర్ నర్సింహన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.  ఆయన ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తిగాకూడా పనిచేశారు. తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్ కొన్ని నెలలు మాత్రమే కొనసాగారు. రాధాకష్ణన్ కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో 1959 ఏప్రిల్ 29న జన్మించారు. అక్కడే పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. తిరువనంతపురంలో 1983లో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంచారు.

TS High court : 10 మంది న్యాయమూర్తులతో ప్రమాణస్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ

టీబీ రాధాకృష్ణన్ 2004 అక్టోబర్ 14న కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు‌సార్లు కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యారు. కేరళ లీగల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గానూ కొనసాగించారు. 12ఏళ్లు కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.