TS Covid Cases : తెలంగాణలో ఈరోజు కొత్తగా 102 కోవిడ్ కేసులు
తెలంగాణలో ఈ రోజు కొత్తగా 102 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 287 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు99.29 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈరోజు విడ

Telangana Covid Cases
TS Covid Cases : తెలంగాణలో ఈ రోజు కొత్తగా 102 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 287 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు99.29 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన తాజా బులెటిన్ లో పేర్కొంది.
దీంతో, రాష్ట్రంలో ఇంతవరకు 7,89,860 మందికి కొవిడ్ సోకగా, వారిలో 7,84,224 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,525 క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఈ రోజు కోవిడ్ వల్ల ఎవరూ మరణించలేదని ఆనివేదికలో తెలిపారు.
Also Read : Governor Tamilisai : గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
జీహెచ్ ఎంసీ పరిధిలో ఈ రోజు కొత్తగా 35 కోవిడ్ కేసులు…రంగా రెడ్డి జిల్లాలో 9, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 6 కోవిడ్ కేసులు….నమోదు కాగా…10 జిల్లాల్లో జీరో కేసులు ఉన్నాయి. ఒక్క జీహెచ్ ఎంసీ పరిధిలో మినహా మిగతా జిల్లాల్లో 10 లోపే కోవిడ్ కేసులు నమోదయ్యాయి.