TS Police : తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు.. డిగ్రీ విద్యార్థులు కూడా పాల్గొనొచ్చు
1959 అక్టోబర్ 21న లడక్ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న పదిమంది సీఆర్పీఎఫ్ జవాన్లు చైనా సైనికులతో విరోచితంగా పోరాడి ప్రాణాలు త్యాగం చేశారు.

Ts Police
TS Police : 1959 అక్టోబర్ 21న లడక్ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న పదిమంది సీఆర్పీఎఫ్ జవాన్లు చైనా సైనికులతో విరోచితంగా పోరాడి ప్రాణాలు త్యాగం చేశారు. వీరి స్మారకార్థంగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవాలని 1960 జనవరిలో జరిగిన రాష్ట్రాల పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ సమావేశంలో నిర్ణయించారు. నాటి నుంచి ప్రతి ఏడూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అమరవీరుల త్యాగాలను తలుచుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక ప్రాంతాల వారీగా క్రీడలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రకటన విడుదల చేసింది పోలీస్ శాఖ.
చదవండి : Police Constable Video Viral : పట్టపగలు పోలీసు గ్రౌండ్‌లో మద్యం సేవించిన పోలీసు వీడియో వైరల్
ఈ ఏడాది వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 8వ తరగతి నుంచి డిగ్రీ చదువే వారివరకు ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొనవచ్చు. “జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర”పై వ్యాసం రాయాల్సి ఉంటుందని తెలిపారు. ఇది 300 పాదాలకు మించకుండా ఉండాలి.
ఈ వ్యాసరచన మూడు విభాగాలలో నిర్వహించనున్నారు.
మొదటి విభాగం: 8 నుంచి 10 వ తరగతి విద్యార్థులు
రెండవ విభాగం: ఇంటర్మీడియట్ విద్యార్థులు
మూడవ విభాగం: డిగ్రీ విద్యార్థులు
మీ వ్యాసాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించడానికి క్రింది పద్దతిని(steps) అనుసరించండి
1. సబ్మిట్ చేయటానికి ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేయండి.
https://forms.gle/HvF8YAgewvyD3wjA9
2. మీ పేరు, తరగతి మరియు ఇతర వివరాలను నమోదు చేయండి
3. మీ వ్యాసాన్ని పేర్కొన్న ప్రదేశంలో 300 పదాలకు మించకుండా సమర్పించండి
జిల్లా / కమిషనరేట్‌లో ఎంపిక చేసిన ఉత్తమ మూడు వ్యాసాలకు సంబంధిత పోలీసు సూపరింటెండెంట్, పోలీసు కమీషనర్లు బహుమతి ప్రదానం చేస్తారు. ఆ వ్యాసాలను సంబంధిత జిల్లా కమిషనరేట్ అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేయటం జరుగుతుంది. అన్ని జిల్లా కార్యాలయాలు, కమిషనరేట్ల స్థాయిలలో బహుమతులు గెలుపొందిన వ్యాసాలలో నుండి ఉత్తమ మూడు వ్యాసాలను “రాష్ట్రంలోని మొదటి మూడు ఉత్తమ వ్యాసాలు” గా ఎంపిక చేసి, తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేయటం జరుగుతుంది.