Corona Telangana : తెలంగాణలో కొత్తగా 2,646 కరోనా కేసులు, ముగ్గురు మృతి

రాష్ట్రంలో ఇవాళ 88,206 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 747 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Corona Telangana : తెలంగాణలో కొత్తగా 2,646 కరోనా కేసులు, ముగ్గురు మృతి

Telangana (2)

Updated On : February 2, 2022 / 9:55 PM IST

Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 2,646 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 34,665 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,603 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇవాళ 88,206 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 747 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

మరోవైపు ఏపీలో కొత్తగా 5,983 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా సోకి గత 24 గంటల్లో 11 మంది మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం 1,00,622 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,86,566కి చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు 14,631 మంది మృతి చెందారు. కరోనాతో విశాఖ జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, ప.గో జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు.

Minister KTR : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి నిధులు ప్రకటించలేదు : మంత్రి కేటీఆర్‌

దేశంలో కొత్తగా 1,61,386 కరోనా కేసులు నమోదయ్యాయి. రికవరీలూ అంతకు మించే ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,81,109 మంది కోలుకున్నారు. కాగా, ఒక్కరోజే 1,733 మంది కరోనాతో మరణించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 16,21,603 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా కేరళలో 51,887, తమిళనాడులో 16,096, మహారాష్ట్రలో 14,372, కర్ణాటకలో 14,366, గుజరాత్ లో 8,338 కేసులు నమోదయ్యాయి.