Telangana Corona : తెలంగాణలో కొత్తగా 1963 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 53వేల 073 మందికి కరోనా పరీక్షలు చేయగా..

Telangana Corona : తెలంగాణలో కొత్తగా 1963 కరోనా కేసులు

Telangana Corona Cases

Telangana Corona : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే నిన్నటితో(2,398) పోలిస్తే ఇవాళ తగ్గాయి.

గడిచిన 24 గంటల్లో 53వేల 073 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,963 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,075 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 168, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 150 కేసులు గుర్తించారు.

China Manja : ప్రాణం తీసిన గాలిపటం మాంజా.. గొంతు తెగి అక్కడికక్కడే మృతి

అదే సమయంలో 1,620 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,07,162 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,81,091 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 22,017 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 4,054కి పెరిగింది.

Ghosts Exist : అవును.. దెయ్యాలున్నాయి.. ఐఐటీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు?
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థల సెలవులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైరస్ విజృంభణ నేపథ్యంలో సంక్రాంతి సెలవులను మూడు రోజుల ముందుగానే (8వ తేదీ) ప్రకటించారు. ఇవి ఈ నెల 16తో ముగియాల్సి ఉంది. అయితే, కొవిడ్ కేసులు రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సెలవులను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రభుత్వం దగ్గర వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉంటాయి. అంటే అప్పటి వరకు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల సంక్రాంతి సెలవులను కూడా అప్పటి వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయం తర్వాతే అధికారికంగా ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది. అయితే, త్వరగా ప్రకటిస్తే పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి రావాలా? లేదంటే సెలవులు ముగిసే వరకు అక్కడే ఉండాలా? అన్న విషయంలో నిర్ణయం తీసుకుంటారని తల్లిదండ్రులు అంటున్నారు.

Image

 

Image