SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో బిగ్ అప్‌డేట్.. బయటపడిన ఓ వ్యక్తి చెయ్యి!
డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

SLBC Tunnel Indicent
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ)లో కార్మికులు చిక్కుకుపోయిన చోట సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, కేరళ జాగిలాలు గుర్తించిన కార్మికుల అనుమానిత ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అక్కడ తవ్వకాలు ముమ్మరం చేశారు.
టీబీఎంకు ఎడమ పక్కన ఓ వ్యక్తి చేయి కనిపించినట్లు సమాచారం. పై నుంచి పడిన కాంక్రీట్ మట్టిలో కూరుకొని అది ఉన్నట్లు తెలుస్తోంది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంది.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో కొన్ని రోజుల క్రితం కార్మికులు పనులు నిర్వహిస్తుండగా దాని పైకప్పు కూలిపోయి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గురుప్రీత్ సింగ్, సన్నీ, మనోజ్, శ్రీనివాస్, సందీప్, అనుజ్, సంతోష్, జక్తాజస్ అనే ఎనిమిది మంది కార్మికులు టన్నెల్లోనే చిక్కుకుపోయారు.
వారిని బయటకు తీసుకొచ్చేందుకు కొన్నిరోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికుల ఆచూకీ కోసం ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఫైర్ సిబ్బంది ఇన్ని రోజులుగా చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలితాన్ని ఇవ్వలేదు.