Bandi Sanjay : పాతబస్తీకి మెట్రో రైలు రప్పిస్తాం.. హిందూ-ముస్లిమ్స్ కు ఉద్యోగాలిప్పిస్తాం

బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీకి మెట్రో రైలు రప్పిస్తామని.. హిందూ-ముస్లిములకు ఉద్యోగలిప్పిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడారు.

Bandi Sanjay : పాతబస్తీకి మెట్రో రైలు రప్పిస్తాం.. హిందూ-ముస్లిమ్స్ కు ఉద్యోగాలిప్పిస్తాం

Bandi Sanjay

Updated On : August 29, 2021 / 6:39 PM IST

Bandi Sanjay Padayatra : బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీకి మెట్రో రైలు రప్పిస్తామని.. హిందూ-ముస్లిములకు ఉద్యోగలిప్పిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. పాదయాత్రలో భాగంగా ఆదివారం (ఆగస్టు 29, 2021) హైదరాబాద్ లోని షేక్ పేట్ నాలా దగ్గర బండి సంజయ్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక మెదటి బహిరంగ సభ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద నిర్వహిస్తామని చెప్పారు.

తెలంగాణ.. బీజేపీ అడ్డా అని అన్నారు. 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసే వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు భారీగా తరలివస్తోన్న భాగ్యనగర్ ప్రజలకు బండి సంజయ్ సెల్యూట్ చేశారు. పాతబస్తీకి మెట్రోరైల్ ను ఎంఐఎం పార్టీ అడ్డుకుందని విమర్శించారు.

బీజేపీ గెలిస్తే మెట్రోరైలు ను పాతబస్తీకి తీసుకెళ్తామని చెప్పారు. దీంతో అక్కడి హిందూ, ముస్లిం యువకులకు ఉద్యోగులు వస్తాయని పేర్కొన్నారు. పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయటం లేదో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు.

పాతబస్తీలో హిందూ సమాజానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పాతబస్తీలో బీజేపీ కోసం హిందువులు సంఘటితమవుతున్నారని పేర్కొన్నారు. గో రక్షణ కోసం కృషి చేస్తోన్న ఎమ్మెల్యే రాజసింగ్ పై కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు.