Tiger : హైదరాబాద్ పరిసరప్రాంతం దుండిగల్ లో పులి సంచారం
సమాచారం అందుకున్న సూరారాం ఫారెస్ట్ సెక్షన్ అధికారి, బీట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి పాదముద్రల ఆనవాళ్లను అధికారులు సేకరించారు.

Tiger
Tiger : హైదరాబాద్ పరిసర ప్రాంతంలో దుండిగల్ మున్సిపాలిటీ సమీపంలోని బౌరంపేట ఔటర్ రింగు రోడ్డు వద్ద పులి సంచారం కలకలం సృష్టించింది. రెండున్నర నిమిషాల పాటుగా వీడియోలో పులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. సమాచారం అందుకున్న సూరారాం ఫారెస్ట్ సెక్షన్ అధికారి, బీట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి పాదముద్రల ఆనవాళ్లను అధికారులు సేకరించారు.
పులి సంచరిస్తున్న వార్తతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే స్థానికులు చెబుతున్న వర్షన్ కి, ఫారెస్ట్ సిబ్బంది చెబుతున్న వర్షన్ కి చాలా తేడా ఉంది. గడిచిన కొద్ది రోజులుగా పులి సంచారిస్తుందని స్థానికులు చెబుతున్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు.
Cheetah In Hetero Labs : సంగారెడ్డి జిల్లాలోని హెటిరో ల్యాబ్స్ లో చిరుత పులి సంచారం
తాము స్వయంగా పులి సంచరిస్తున్న ఆనవాళ్లు చూసినట్టుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. పులి సంచరిస్తున్నట్లుగా సీసీటీవి ఫుటేజ్ ఆనవాళ్లు ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులు ప్రాంతానికి వెళ్లి పులి పాదముద్రల ఆనవాళ్లు సేకరించారు. పులి సంచరిస్తుడంటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.