Kazipet : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు టీఆర్ఎస్ డిమాండ్.. బీజేపీ నేతలు తిరగలేరని వార్నింగ్

రాష్ట్ర విభజన సమస్యల్లో భాగంగా కాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఏ రాష్ట్రం నుంచి రైల్వేమంత్రులు వస్తే

Kazipet : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు టీఆర్ఎస్ డిమాండ్.. బీజేపీ నేతలు తిరగలేరని వార్నింగ్

Kazipet Railway Coach Factory

Updated On : January 31, 2022 / 7:24 PM IST

Kazipet Railway Coach : వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి నాయకులు రైల్ నిలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట వ్యాగన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర బీజేపీ నేతలు సహకరించాలన్నారు. రాష్ట్ర విభజన సమస్యల్లో భాగంగా కాజీపేట్ లో కోచ్ ఫ్యాక్టరీ హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ కేంద్రం మాత్రం గత ఏడు సంవత్సరాలుగా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపుతోందని మండిపడ్డారు.

Covid HIV Patient : కరోనా సోకిన ఆ HIV పేషెంట్ శరీరంలో ఏకంగా 21 మ్యుటేషన్లు.. అధ్యయనంలో తేల్చిన సైంటిస్టులు..!

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సంఘీభావం తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంకు కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి నాయకులు వినతిపత్రం అందజేశారు.

కేంద్ర కేబినెట్ లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ అన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఏ రాష్ట్రం నుంచి రైల్వే మంత్రులు వస్తే వారికే ప్రాజెక్టులు పోతున్నాయని ఆరోపించారు. గుజరాత్, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలకు రాష్ట్ర భాగస్వామ్యం లేకుండానే రైల్వే ట్రాక్ లు, ప్రాజెక్ట్ లు ఇస్తున్నారని చెప్పారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి, నిధులు ఇచ్చిందన్నారు. బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. బడ్జెట్ లో తెలంగాణ కు అన్యాయం జరిగితే బీజేపీ నేతలను తిరగనివ్వమని హెచ్చరించారు.

”రైల్వే బడ్జెట్ ను కేంద్రం విస్మరించింది. రైల్వేను అంబానీ, అదానీలకు అప్పగించింది. దీని వల్ల లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగావకాశాల్లో అవకాశం ఉండదు. ఏడేళ్లుగా ఇదే విషయంపై టీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాము” అని హెచ్చరించారు.

Statue of Equity: ఫిబ్రవరి 2 నుంచి.. వైభవంగా రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండగ..!

కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన డిమాండ్లపై తన పోరాటాన్ని ఉధృతం చేసింది టీఆర్ఎస్. ఇప్పటికే రాష్ట్ర డిమాండ్ల సాధన కోసం రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. కాగా రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని రాష్ట్ర ఎంపీలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సుమారు 27 అంశాలపై కేంద్రం నుండి స్పష్టత తీసుకోవడంతో పాటు ఆయా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించారు.