TRSLP : ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ భవన్‌లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు

TRSLP : ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

Cm Kcr Warangal Tour

Updated On : November 16, 2021 / 7:57 AM IST

TRSLP :  ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలనీ బీజేపీ డిమాండ్ చేస్తుంటే.. కేంద్రం వరిధాన్యం కొనడం లేదని ఆరోపిస్తుంది టీఆర్ఎస్. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల పర్వానికి ఇప్పుడప్పుడే చెక్ పడేలా కనిపించడం లేదు. ఇక మంగళవారం సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది.

చదవండి : CM KCR: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు

ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై చర్చించనున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రంపై ఢిల్లీ స్థాయి ఆందోళనతో పాటు.. రాష్ట్రంలో ఏ రూపంలో ఆందోళన కొనసాగించాలో నేడు వ్యూహాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా త్వరలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

చదవండి : CM KCR : దళితబంధుకు వచ్చే బడ్జెట్‌లో రూ.20,000 కోట్లు