Union Minister Amit Shah: రేపు రాత్రి హైదరాబాద్‌కు కేంద్ర మంత్రి అమిత్ షా.. 17న టూర్ షెడ్యూల్ ఇలా..

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. రేపు రాత్రి హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా.. 17న వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Union Minister Amit Shah: రేపు రాత్రి హైదరాబాద్‌కు కేంద్ర మంత్రి అమిత్ షా.. 17న టూర్ షెడ్యూల్ ఇలా..

Amit Shah

Updated On : September 15, 2022 / 6:19 PM IST

Union Minister Amit Shah: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. రేపు రాత్రి 10గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నఅమిత్ షా.. రాత్రి పోలీస్ అకాడమీలో బస చేస్తారు. 17వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ తలపెట్టిన తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా అమిత్ షా హాజరవుతారు. విమోచన దినోత్సవం రోజంతా హైదరాబాదులోనే ఉంటూ వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

Telangana Secretariat: తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు.. ప్రభుత్వ నిర్ణయం

17న ఉదయం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే సభకు అమిత్ షా హాజరువుతారు. ఉదయం 8.45 గంటల నుంచి 11.45 గంటల వరకు అమిత్ షా అక్కడే ఉంటారు. విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తారు. సభ అనంతరం పరేడ్ గ్రౌండ్ నుంచి బేగంపేట టూరిజం ప్లాజా‌కు బయలుదేరుతారు. టూరిజం ప్లాజాలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌కు అమిత్ షా చేరుకుంటారు.

Man Selfie With Fish: అయ్యయ్యో..! చేపకు బదులు ఫోన్‌ను నీటిలోకి విసిరేసిన వ్యక్తి.. నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తున్న వీడియో

అక్కడ మోదీ పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొని వికలాంగులకు సహాయక ఉపకరణాలను పంపిణీ చేస్తారు. కార్యక్రమం అనంతరం తిరిగి రాజేంద్ర నగర్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు. అక్కడ పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.