మేడిగడ్డ, అన్నారం, రామగుండం పరిశీలన.. తప్పులు తేలితే..: మంత్రి ఉత్తమ్
ఎవరైనా కమిటీకి సహకరించకపోతే, డాక్యుమెంట్స్ దాచితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Uttam Kumar Reddy
బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో పాల్గొన్నారు. బ్యారేజి డ్యామేజ్‌కి రీజన్స్ చెప్పాలని నిలదీశారు. బ్యారేజీలు రిపేర్ చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని, సాధ్యాసాధ్యాలు చెప్పాలన్నారు.
ఎన్డీఎస్ఏ కమిటీకి పూర్తి సహకారం ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఎవరైనా కమిటీకి సహకరించకపోతే, డాక్యుమెంట్స్ దాచితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం ఉదయం మేడిగడ్డ, ఆ తర్వాత అన్నారం, రేపు రాత్రి రామగుండం, 8న సుంధిల్ల బ్యారేజీల పరిశీలన ఉంటుందని తెలిపారు.
వాటిని పరీక్షించడానికి అత్యాధునిక టెక్నాలజీ వాడాలని సూచించామని ఉత్తమ్ చెప్పారు. రిపేర్ చేసి, వర్షాకాలానికి ముందే అందుబాటులోకి వస్తే బాగుంటుందని చెప్పారు. ఈఎన్సీ నాగేందర్ ఆధ్వర్యంలో అయ్యర్ కమిటీ పరిశీలన పూర్తి చేస్తుందని తెలిపారు. ప్రాథమిక రిపోర్ట్ రాగానే తప్పులు ఉంటే నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
నిర్మాణ సంస్థకు బాధ్యత ఉండాలని ఉత్తమ్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విచిత్రమైన ఆరోపణలు చేశారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అనడం అతిశయోక్తిగా ఉందని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వేల కోట్ల రూపాయల రుణాలు ఇప్పించి, ఇప్పుడు అవినీతి అనడం అశ్చర్యమని ఉత్తమ్ తెలిపారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఇప్పుడు ఎన్నికల వేళ తెలంగాణకు వచ్చి అభివృద్ధి శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. విభజన హామీలు బీజేపీ మర్చిపోయిందని, దేశంలో సైతం హామీలు అమలు చెయ్యలేదని తెలిపారు.
Koneru konappa : గులాబీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గుడ్ బై?