V Hanumantha Rao : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వీహెచ్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు హనుమంతరావు

V Hanumantha Rao
V Hanumantha Rao : కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు హనుమంతరావు.
ఈ నేపథ్యంలోనే ఆయన అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది. అపోలో వైద్యులు వీహెచ్ కు చికిత్స చేస్తున్నారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. వీహెచ్ త్వరగా కోలుకోవాలని పలువురు కాంగ్రెస్ నేతలు ఆకాంక్షిస్తున్నారు.
కాగా, గత ఏడాది వీహెచ్‌కు కరోనా సోకగా ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్న విషయం తెలిసిందే.