Bandi Sanjay Kumar : ఆ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కి వేసినట్టే, బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి- బండి సంజయ్
Bandi Sanjay Kumar : మునిగిపోయే నావలో కొంతమంది చేరుతున్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే వాళ్లు బీఆర్ఎస్ లో చేరడం ఖాయం.

Bandi Sanjay (Photo : Twitter)
Bandi Sanjay Kumar – BRS : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్ కి వేసినట్లు అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదని, రెండూ ఒక్కటే అని ఆయన చెప్పారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు బండి సంజయ్. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే.. కేసీఆర్ సంగతి చూద్దాం అని వ్యాఖ్యానించారు. బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగించారు.
” ఐదేళ్లు సమయం ఇస్తే బీఆర్ఎస్, కేసీఆర్ సంగతి చూద్దాం. చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యాడు కాబట్టే పేదల కష్టం తెలుసు. ప్రధానమంత్రి అవాస్ కింద 3 కోట్ల ఇళ్లు ట్టించిన ఘనత మోడీది. తెలంగాణకు మోడీ ఇచ్చిన రెండున్నర లక్షల ఇళ్లు ఎటు పోయాయి? 12కోట్ల మందికి ఉచిత గ్యాస్, 16వేల విలువ గల ఉచిత కోవిడ్ వ్యాక్సిన్, ఉచిత బియ్యం ఇచ్చిన ఘనత మోడీది.(Bandi Sanjay Kumar)
బీఆర్ఎస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు 80సార్లు పగలడం అవినీతికి నిదర్శనం. ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ వల్ల గ్రామాలు మునిగినా.. పంటలు మునిగినా సర్కార్ కి పట్టింపు లేదు. కాంగ్రెస్- బీఆర్ఎస్ కలిసి వస్తున్నాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ఫండింగ్ చేస్తోంది. కేసీఆర్ కావాలనే కాంగ్రెస్ ను లేపే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జీరో. ఇక్కడి ప్రజలు ఆ పార్టీని విశ్వసించరు. మునిగిపోయే నావలో కొంతమంది చేరుతున్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే వాళ్లు బీఆర్ఎస్ లో చేరడం ఖాయం. కాంగ్రెస్ కి ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టే. కాంగ్రెస్, బీఆర్ఎస్ లతో బీజేపీ ఏనాడూ కలవలేదు. కాంగ్రెస్ లో నాలుగు స్తంభాల ఆట కొనసాగుతోంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు కేసీఆర్ కుట్ర. కేటీఆర్.. నీ చరిత్ర ప్రజలకు తెలుసు. ఉద్యమ సమయంలో అమెరికాలో కేటీఆర్ చిప్పలు కడిగారు. నీ అయ్య లేకపోతే నిన్ను ఎవడు పట్టించుకుంటాడు కేటీఆర్. కేసీఆర్ చేసినవన్నీ దొంగ దీక్షలే. కేసీఆర్ ను చూసి దేశం మొత్తం నవ్వుకుంటుంది. పేదోళ్లు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసింది? 27మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయినా.. రైతులు, నిరుద్యోగులు చనిపోతున్నా కేసీఆర్ కి పట్టింపు లేదు” అని బండి సంజయ్ అన్నారు.
పదవి వదులుకునేందుకు సిద్ధం:
పేదోళ్ల బతుకులు కొల్లగొట్టి కేసీఆర్ కుటుంబం విదేశాల్లో పెట్టుబడి పెడుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోడ్లపైకి వస్తే ఆడవాళ్లు పారిపోయే పరిస్థితి వచ్చింది. పోలీసుల బలంతో ఎమ్మెల్యేలు గెలుస్తున్నారని కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటు. అధ్యక్ష పదవి కోసం పాకులాడను. కేసీఆర్ ను కొట్టడమే మా లక్ష్యం. నేను సామాన్య కార్యకర్తను. నా బిస్తర్ రెడీ ఉంది. ఎప్పుడు చెప్పినా అధ్యక్ష పదవి వదులుకుంటా. బీజేపీ వ్యక్తితో కాదు. వ్యవస్థపరంగా బలంగా ఉంది.