దుబ్బాక ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్…టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా పోటీ చేస్తాం

  • Published By: bheemraj ,Published On : August 14, 2020 / 04:18 PM IST
దుబ్బాక ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్…టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా పోటీ చేస్తాం

Updated On : August 14, 2020 / 4:47 PM IST

సోలిపేట రామలింగారెడ్డి మరణంలో ఖాళీ అయిన దుబ్బాకలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పోటీ చేస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికకు సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపిచ్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణ జనసమితికి సంబంధించిన మెదక్ జిల్లా నాయకురాలు భవానీరెడ్డి తన అనుచరులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రామలింగారెడ్డి మరణంతో రాబోతున్న దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? అభ్యర్థి ఎవరన్నది తమకు సంబంధం లేదని ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పోటీలో ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ పై వ్యతిరేకతను ప్రతిబింబించేందుకు ఈ ఎన్నికలు వాడుకుంటామని చెప్పారు.

మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన పార్టీగా తమకు మూల సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఇటీవల సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మాట్లాడుతూ రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు గానీ టికెట్ ఇస్తే వారిని యునానమస్ చేసేందుకు పార్టీ నాయకత్వానికి నచ్చజెప్పుతానని అన్నారు. అయితే జగ్గారెడ్డి పక్కన ఉన్నా కూడా వారిని పట్టించుకోకుండా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. అభ్యర్థులతో తమకు పని లేదని కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీలాగే ఉంటామని చెప్పడంతో జగ్గారెడ్డి సంశయంలో పడ్డారు.

కుటుంబ సభ్యులకు ఇస్తే ఏకగ్రీవానికి ప్రయత్నిస్తామని రెండు సార్లు జగ్గారెడ్డి అధికారికంగా చెప్పారు. అయితే టీఆర్ఎస్ నుంచి ఎవరు అభ్యర్థి అనేది ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి అభ్యర్థి ఎవరైనా తమకు ఇబ్బంది లేదని కచ్చితంగా పోటీలో ఉంటామని చెప్పారు.

గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పైన వరుస కార్యాచరణ తీసుకుని పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకునేందుకు, ప్రజా వ్యతిరేకతను చూపించేందుకు ఎన్నికను ఉపయోగించుకుంటామని ఉత్తమ్ చెప్పారు. ఎన్నిక ఎప్పుడొస్తుందన్న విషయం పక్కన బెడితే ఎన్నిక జరిగేటప్పుడు మాత్రం పోటీ అనివార్యమని క్లారిటీ వచ్చింది.

పీసీసీ చీఫ్ స్థాయిలో ఉత్తమ్ మాట్లాడిన తర్వాత ఇప్పుడే మాట్లాడటం సబబు కాదని జగ్గారెడ్డి అన్నారు. ఇవన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లి చర్చించే అవకాశముంది. ప్రకటన చేసినంత మాత్రాన పోటీ కాదన్న అభిప్రాయాన్ని జగ్గారెడ్డి వ్యక్తం చేశారు. తనకు జిల్లాలకు సంబంధించి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తన అభిప్రాయాన్ని తీసుకోవాల్సివుంటుందని చెప్పారు.

అయితే తాను వ్యక్తిగతం చెప్పాను తప్ప పార్టీ నిర్ణయంగా చెప్పలేదన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఆమోదించాలా లేదా అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని జగ్గారెడ్డి చెప్పారు.