Ministers : తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం : మంత్రులు
ఖమ్మం పాత బస్టాండులో మహాలక్ష్మి పథకాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.

ministers (2)
Telangana Ministers : ప్రజలు ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందించారని రెవిన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీలను అన్ని అమలు చేస్తామని చెప్పారు. ఆదివారం ఖమ్మం పాత బస్టాండులో మహాలక్ష్మి పథకాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఇప్పుడు రెండు పథకాలను అమలు చేశామని తెలిపారు. మహిళ ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్ లను అమలు చేశామని పేర్కొన్నారు. మిగతా హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. తల తాకట్టు పెట్టి ఐనా హామీలను అమలు చేస్తామని చెప్పారు.
CM Revanth Reddy : యశోద ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
గతంలో కొంతమంది వల్ల తప్పులు జరిగాయి : తుమ్మల
ఖమ్మం ప్రజల కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా ఋణం తీర్చుకోలేమని వ్యవసాయం, మార్కెట్, శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. తన రాజకీయ జీవితం 40ఏళ్ళని, భట్టి తనకు మళ్ళీ 5 ఏళ్ళు ఇచ్చారని తెలిపారు.
గతంలో కొందరు తలమాసిన వ్యక్తుల వలన తప్పులు జరిగాయని విమర్శించారు. తప్పుడు కేసులు, ఆక్రమణలు ఉంటే వాటిని సరి చేసుకోవాలని సూచించారు. సీపీ, కలెక్టర్ తెలంగాణలోనే ఉంటారని ప్రజల కోసం పని చేయాలన్నారు.