Cool News : ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు
Rain Alert : తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా ఉత్తర కర్నాటక వరకు ద్రోణి విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి.

Rain Alert
Rain Alert : మాడు పగిలే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణకు వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా ఉత్తర కర్నాటక వరకు ద్రోణి విస్తరించి ఉంది.
దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read..Hot Summer : వడదెబ్బతో 19 మంది మృతి.. తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు..
రేపు(మే 20) భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు కురుస్తాయంది.