Weather update: తెలంగాణలో 5 రోజులు అతి భారీ వర్షాలు

ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

Weather update: తెలంగాణలో 5 రోజులు అతి భారీ వర్షాలు

Rain

Updated On : July 23, 2023 / 7:39 PM IST

Weather update Telangana: తెలంగాణలో రాగల అయిదు రోజులు భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న పశ్చిమ మధ్య, దాని పక్కనున్న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ దక్షిణ ఒడిశా (Odisha) పరిసరాల్లో సగటు సముద్రమట్టం నుంచి 3.1 కిలో మీటర్ల ఎత్తులో కోనసాగుతోందని వివరించారు.

ఇవాళ కూడా షీయర్ జోన్ 20°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపారు. దీంతో రాగల ఐదు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఈ నెల 25, 26 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (ఆరంజ్ అలెర్ట్ ) పలు ప్రాంతాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రేపటి నుంచి రాగల నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

Bengaluru : 2.5 టన్నుల టమాటాలున్న లారీ హైజాక్.. రైతును నెట్టేసి లారీని దారి తప్పించిన ముఠా