Wife illegal affair: భార్య అక్రమ సంబంధం భర్త ప్రాణం తీసింది.. పోలీసుల విచారణలో ఊహించని ట్విస్ట్..

భార్యాభర్త మధ్య మనస్పర్థలు అక్రమ సంబంధాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా వారి వివాహ జీవితాన్నే సర్వనాశనం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రోజుకు అనేకం వెలుగు చూస్తున్నాయి. భార్యాభర్తల మధ్య విబేధాలుకాస్త.. పిల్లలనూ అనాథలుగా మారుస్తున్నాయి. ఇలాంటి ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో భర్తను ...

Wife illegal affair: భార్య అక్రమ సంబంధం భర్త ప్రాణం తీసింది.. పోలీసుల విచారణలో ఊహించని ట్విస్ట్..

Crime News

Updated On : May 30, 2022 / 2:14 PM IST

Wife illegal affair: భార్యాభర్త మధ్య మనస్పర్థలు అక్రమ సంబంధాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా వారి వివాహ జీవితాన్నే సర్వనాశనం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రోజుకు అనేకం వెలుగు చూస్తున్నాయి. భార్యాభర్తల మధ్య విబేధాలుకాస్త.. పిల్లలనూ అనాథలుగా మారుస్తున్నాయి. ఇలాంటి ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో భర్తను హత్యచేసిన భార్య.. ప్రియుడుతో కలిసి వాగులో పూడ్చిపెట్టింది. విషయం కాస్త బయటకు పొక్కడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి.

Illegal Affair : అమానుషం.. వివాహేతర సంబంధం నెపంతో స్తంభానికి కట్టేసి కొట్టారు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని గుండ్లపల్లిలో కట్టుకున్న భర్తను భార్య హత్యచేసింది. గుండ్లపల్లికి చెందిన పెనుగొండ లక్ష్మి, వెంకట్ రెడ్డి భార్యాభర్తలు. అయితే లక్ష్మి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొంతకాలంగా రహస్యంగా ప్రియుడితో కలిసి అక్రమ సంబంధాన్ని కొనసాగించగా.. విషయం భర్త వెంకటరెడ్డికి తెలిసింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవప పడుతుండేవారు. అదే గ్రామానికి చెందిన లక్ష్మి ప్రియుడు వెంకట స్వామి వీలుచిక్కినప్పుడల్లా లక్ష్మీ ఇంటికి వచ్చేవాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వెంకట్ రెడ్డి లక్ష్మీని గట్టిగా నిలదీశాడు. వీరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో భర్త అడ్డును తొలగించుకోవాలని లక్ష్మీ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ప్రియుడు వెంకటస్వామికి వివరించింది. భర్త ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీ రోకలి బండతో తలపై చితకబాదింది. వెంకట్ రెడ్డి మృతిచెందాడని భావించి ప్రియుడు సహాయంతో మృతదేహాన్ని హస్నాబాద్ పొట్లపల్లి వాగులో పూడ్చిపెట్టింది.

Crime news: హైదరాబాద్ పరువు హత్య కేసులో పురోగతి..

రెండు రోజులుగా వెంకటస్వామి కనిపించక పోవటంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. భార్యపై అనుమానంతో వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లక్ష్మీని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడు వెంకట స్వామి అంటే తనకు ఇష్టమని అతనితో జీవించేందుకు తన భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించి హత్యచేసి వాగులో పూడ్చిపెట్టామని పోలీసులకు తెలిపింది. దీంతో వెంకట్ రెడ్డిని హత్యచేసిన లక్ష్మీ, అందుకు సహకరించిన ఆమె ప్రియుడు వెంకటస్వామిని పోలీసులు అరెస్టు చేశారు.