TPCC Chief : పాదయాత్ర చేపట్టే ఆలోచన ఉంది, జూలై 07న బాధ్యతలు తీసుకుంటా

రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టే ఆలోచన ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఆయన్ను అధిష్టానం టీపీసీసీ ప్రెసిడెంట్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

TPCC Chief : పాదయాత్ర చేపట్టే ఆలోచన ఉంది, జూలై 07న బాధ్యతలు తీసుకుంటా

Tpcc Revanth

Updated On : June 27, 2021 / 6:21 PM IST

TPCC Chief Revanth Reddy : రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టే ఆలోచన ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఆయన్ను అధిష్టానం టీపీసీసీ ప్రెసిడెంట్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. జూలై 07వ తేదీన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోలేనని, రాష్ట్రంలో ప్రజలు పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసిన లింగోజిగూడలో కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు రేవంత్. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

రేవంత్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చిన ఏఐసీసీ.. ఐదుగురికి వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్‌ ఉపాధ్యక్షులుగా నియమించింది.
మరో మూడు కమిటీలను కూడా ఏర్పాటు చేసింది.
గతంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఉన్న వారిలో రేవంత్‌ను అధ్యక్షుడిగా నియమించగా.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్‌లను తప్పించింది.

అజారుద్దీన్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగిస్తూ.. కొత్తగా సీనియర్‌ నేతలు గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు అవకాశమిచ్చింది.
ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు పదవులు ఇచ్చింది ఏఐసీసీ.