YS Jagan : నాంపల్లికోర్టులో విచారణకు హాజరైన జగన్.. భారీ స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు

YS Jagan : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరయ్యారు. జగన్ హైదరాబాద్ ..

YS Jagan : నాంపల్లికోర్టులో విచారణకు హాజరైన జగన్.. భారీ స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు

YS Jagan

Updated On : November 20, 2025 / 12:22 PM IST

YS Jagan : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరయ్యారు. జగన్ హైదరాబాద్ రావడంతో బేగంపేట ఎయిర్ పోర్టు వద్దకు భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు. దారి పొడవునా ఆయనతో ముందుకు కదులుతూ కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. బేగంపేట నుంచి నాంపల్లి కోర్టు జగన్ కాన్వాయ్ వెంట అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు.

నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్ రావడంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టుకు వచ్చే రెండు మార్గాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకొని.. న్యాయవాదులకు మాత్రమే లోపలికి అనుమతించారు. అక్రమాస్తుల కేసులో జగన్ ను సీబీఐ కోర్టు విచారించింది. దాదాపు అరగంట సేపు  జగన్ కోర్టులో ఉన్నారు. విచారణ ముగిసిన తరువాత వైఎస్ జగన్ లోటస్ పాండ్‌లోని నివాసానికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత మళ్లీ బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ఏపీకి వెళ్తారు.