ఆన్‌లైన్‌లో రామ‌కృష్ణ మ‌ఠం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు

ఆన్‌లైన్‌లో రామ‌కృష్ణ మ‌ఠం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు

Updated On : December 15, 2020 / 9:37 PM IST

RK MATH SPOKEN ENGLISH CLASES రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అతి త్వ‌ర‌లో స్పోకెన్ ఇంగ్లిష్ త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. జ‌న‌వ‌రి-9 2021 నుండి బేసిక్‌,జూనియ‌ర్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఆన్‌లైన్ ద్వారా ప్రారంభం కానున్న‌ట్లు నిర్వాహాకులు తెలిపారు.

ఈ శిక్షణ శిభిరంలో పాల్గొనే అభ్యర్థులు డిసెంబర్28-2020 లోపు రామకృష్ణ మఠం హైదరాబాద్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ అడ్మిషన్ పొందగలర‌ని సూచించారు. అభ్యర్థి కనీస వయసు 17 సంవత్సరాలు, లేదా 10వ తరగతి పాస్ అయి ఉండాలన్నారు. శిక్షణ రుసుము రూ. 1300. కోర్సుకి సంబంధించిన మెటిరియ‌ల్ ‌ను పోస్ట్ ద్వారా పంప‌నున్నారు. కోవిడ్ కారణాన యిటువంటి సువర్ణ అవకాశం మారు మూల గ్రామాల్లో సైతం లభ్యం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ఈ అవకాశాన్ని వినియోగించు కోగలరని నిర్వాహకులు తెలిపారు.