బ్రేకింగ్, ఏపీలో 40కి చేరిన కరోనా కేసులు, ఒక్కరోజే 17 కేసులు నమోదు, పదేళ్ల బాలుడికి కరోనా
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి పెరిగింది. ఈ

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి పెరిగింది. ఈ
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి పెరిగింది. ఈ ఒక్కరోజే 17 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం(మార్చి 31,2020) ప్రకటన విడుదల చేసింది. బాధితుల్లో ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. తాజాగా పదేళ్ల బాలుడికి కరోనా సోకినట్టు తేలడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా హిందూపురంకి చెందిన బాలుడి కరోనా పాజిటివ్ వచ్చింది.
నిన్నటి వరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 23. ఆ సంఖ్య కాస్త ఒక్కసారిగా 40కి పెరగడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేసే యోచనలో ఉంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
* ఏపీలో పెరిగిన కరోనా కేసులు
* 40కి చేరిన బాధితులు
* ఒక్కరోజే 17 కేసులు నమోదు
* అనంతపురం జిల్లా లేపాక్షికి చెందిన పదేళ్ల బాలుడికి కరోనా
* మక్కా నుంచి వచ్చిన కర్నాటక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న బాలుడు
* అనంతపురం జిల్లా లేపాక్షికి చెందిన 34 ఏళ్ల మహిలకు కరోనా
* మక్కా నుంచి వచ్చిన కర్నాటక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న మహిళ
* ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11 కరోనా కేసులు
* గుంటూరు జిల్లాలో 9కి చేరిన కరోనా కేసులు
* విశాఖ జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 5కి చేరిన కరోనా కేసులు
* తూర్పుగోదావరి జిల్లాలో 4 కేసులు
* అనంతపురం జిల్లాలో 2కి చేరిన కేసులు
* చిత్తూరు, కర్నూలు, నెల్లూరులో ఒక్కో కేసు నమోదు
* సోమవారం(మార్చి 30,2020) రాత్రి నుంచి ఇప్పటివరకు(ఉదయం 11 వరకు) 17 కొత్త కరోనా కేసులు