జగన్ వైసీపీని బీజేపీలో కలిపేస్తారు: నారా రోహిత్

వైసీపీకి ఓటు వేస్తే నీళ్లులేని బావిలో దూకినట్లేనని తెలుగుదేశం పార్టీ సినిమా స్టార్ క్యాంపెయినర్ నారా రోహిత్ అన్నారు.

  • Published By: vamsi ,Published On : April 9, 2019 / 04:26 AM IST
జగన్ వైసీపీని బీజేపీలో కలిపేస్తారు: నారా రోహిత్

Updated On : April 9, 2019 / 4:26 AM IST

వైసీపీకి ఓటు వేస్తే నీళ్లులేని బావిలో దూకినట్లేనని తెలుగుదేశం పార్టీ సినిమా స్టార్ క్యాంపెయినర్ నారా రోహిత్ అన్నారు.

వైసీపీకి ఓటు వేస్తే నీళ్లులేని బావిలో దూకినట్లేనని తెలుగుదేశం పార్టీ సినిమా స్టార్ క్యాంపెయినర్ నారా రోహిత్ అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లె, ఎన్టీఆర్‌ సర్కిల్‌, బెంగళూరు బస్టాండు వద్ద వచ్చిన ప్రజలను ఉద్ధేశించి మాట్లాడిన రోహిత్.. ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును మళ్లీ గెలిపించుకోవాలని కోరారు. 
Read Also : జగన్ హామీ : లోకేష్‌పై ఆర్కేని గెలిపిస్తే మంత్రి పదవి

చంద్రబాబు విజయం అడ్డుకోవాలని చూస్తున్న మూడు దుష్టశక్తులు ఏకమయ్యాయని, అయినా వారు ఏమీ చెయ్యలేరని రోహిత్ అన్నారు. రాష్ట్రం విడిపోయాక ఒకవైపు రాజధాని నిర్మాణం చేస్తూ మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను నిరవధికంగా కొనసాగించి చంద్రబాబు ప్రజల మన్ననలు పొందారని అన్నారు. ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ నేరుగా బీజేపీతో కలిసిపోతుందని నారా రోహిత్ అన్నారు. తనపై ఉన్న 32కేసులు మాఫీ చేసుకునేందుకు బీజేపీతో దోస్తీ చేసుకుంటున్నారని రోహిత్ ఆరోపించారు.
Read Also : సర్వేలు అనుకూలం: ఓటమి భయంతో వైసీపీ బెంబేలు