అభిమాని అత్యుత్సాహం..కిందపడ్డ పవన్ కళ్యాణ్
అభిమానుల అత్యుత్సాహానికి సెలబ్రెటీలు ఇబ్బందులు పడుతుంటారు. వారితో షేక్ హ్యాండ్ ఇవ్వాలని..వారితో సెల్ఫీలు దిగాలని ప్రయత్నిస్తుంటారు.

అభిమానుల అత్యుత్సాహానికి సెలబ్రెటీలు ఇబ్బందులు పడుతుంటారు. వారితో షేక్ హ్యాండ్ ఇవ్వాలని..వారితో సెల్ఫీలు దిగాలని ప్రయత్నిస్తుంటారు.
అభిమానుల అత్యుత్సాహానికి సెలబ్రెటీలు ఇబ్బందులు పడుతుంటారు. వారితో షేక్ హ్యాండ్ ఇవ్వాలని..వారితో సెల్ఫీలు దిగాలని ప్రయత్నిస్తుంటారు. ఈ సందర్భంగా అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఓ అభిమాని చేసిన అత్యుత్సాహం పవన్ కళ్యాణ్ కిందపడేలా చేసింది. ఇప్పటికే ఫ్యాన్స్ వల్ల పవన్ పలు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగున్నాయి. ఎన్నికల్లో పవన్ స్థాపించిన జనసేన పార్టీ పోటీ చేస్తోంది. ఈ సందర్భంగా ఆయన సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు.
Read Also : జనసేన ప్రభుత్వం వస్తే : ఉత్తరాంధ్రలో వలసలు ఆపేస్తా
విజయనగరంలో ఏప్రిల్ 05వ తేదీ శుక్రవారం పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయోధ్య మైదానంలో నిర్వహించే ఎన్నికల సభ జరుగుతోంది. వేదికపై చేరుకున్న పవన్ మాట్లాడేందుకు సిద్ధమౌతున్నారు. అంతలోనే ఓ అభిమాని వేగంగా వేదిక మీదకు దూసుకొచ్చాడు. పవన్ కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. ఎంతలా పట్టుకున్నాడంటే పవన్ బ్యాలెన్స్ కోల్పోయాడు. వెంటనే కిందపడిపోయాడు. పక్కనే ఉన్న మైక్ కూడా విరిగిపోయింది. వెంటనే భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Also : బై..బై బాబు : జగన్ను సీఎం చేయండి – షర్మిల