బాబు లక్ష్యం అదే : సైబరాబాద్‌ని నిర్మించింది నేనే – బాబు

విజయవాడ : తాను చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తోడు సైబరాబాద్ అనే నగరాన్ని నిర్మించానని గుర్తు చేశారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. చరిత్రలో ఈ విషయం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఇప్పుడు అమరావతి నగరాన్ని నిర్మించడమే తన లక్ష్యమన్నారు. అమరావతిని ప్రపంచంలోని ఐదు నగరాల్లో ఒకటిగా నిలపడయమే తన ఆకాంక్షని చెప్పారు. అంతకుముందు రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మికంగా పర్యటించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి పర్యటించిన సీఎం.. ఎమ్మెల్యే క్వార్టర్లు, ఆలిండియా సర్వీస్ అధికారుల ఇళ్ళు, హై కోర్టు నిర్మాణ ప్రాంతాలను కుటుంబ సభ్యులకు చూపించారు.