ఏపీలో కేబినేట్ హీట్ : ఈసీ నిర్ణయమే ఫైనల్ అంటున్న సీఎస్

మే 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం కోసం సీఎంఓ నుండి సీఎస్‌కు నోట్ పంపారు. అయితే కేబినెట్ నిర్వహణపై మంగళవారం(మే 7వ తేదీ) మధ్యాహ్నం సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్, జీఏడీ పొలిటికల్ కార్యదర్శి శ్రీకాంత్‌తో సీఎస్ సమావేశం అయ్యారు. భేటీ పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎస్ సుబ్రహ్మణ్యం.. ఈ నెల 10 వ తేదీన కేబినెట్ నిర్వహణ అనుమానమేనని, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతే కేబినెట్ బేటి నిర్వహణ ఉంటుందని సీఎస్ వెల్లడించారు.
అజెండాలో అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇస్తేనే కేబినెట్ భేటీ ఉంటుందని సీఎస్ స్పష్టం చేశారు. అసాధారణ పరిస్థితులు ఉంటేనే కేబినెట్ నిర్వహణకు అనుమతి ఉంటుందని, ఏయే అంశాలు అజెండాలో పెట్టాలనేది సీఎం కార్యాలయం సమాచారం ఇవ్వాలని సీఎస్ కోరారు. సీఎంవో ఇచ్చే అజెండాపై ఆయా శాఖల నుంచి వివరాలు తీసుసకుని, సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ పరిశీలిస్తోందని అప్పుడు అంశాలను ఈసీకి పంపిస్తామని చెప్పారు.
ఫొని తుఫాన్ కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కరువు పరిస్థితులపై చేపట్టాల్సిన చర్యలు ఏమిటనేది కేబినెట్‌లో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తుంది.