యువకుడిపై లాఠీచార్జి చేసిన ఎస్సైని సస్పెండ్ చేసిన డీజీపీ

  • Published By: chvmurthy ,Published On : March 27, 2020 / 07:48 AM IST
యువకుడిపై లాఠీచార్జి చేసిన ఎస్సైని  సస్పెండ్  చేసిన డీజీపీ

Updated On : March 27, 2020 / 7:48 AM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో  దుబాయ్ నుంచి వచ్చి…స్వీయ నిర్బంధం కాలేదని ఒక యువకుడి పైన అతని కుటుంబ సభ్యులపైనా లాఠీ చార్జి చేసిన ఎస్సైని డీజీపీ సస్పెండ్ చేశారు.  కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని బయటకు రావోద్దని అధికారులు, పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిత్యావసరాల కోసం రోజులో కొంత సమయం  ఇస్తున్నారు.
 

విదేశాల నుంచి వచ్చిన వారి సమచారం తెలుసుకుని వారిని క్వారంటైన్ కు తరలించారు. కానీ పశ్చిమ  గోదావరి జిల్లా పెరవలి ఎస్సై కిరణ్ కుమార్ మాత్రం ఓవరాయాక్షన్ చేశారు. విదేశాలనుంచి వచ్చిన ఒక యువకుడి కుటుంబంపై విరుచుకు పడ్డారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆ యువకుడు క్వారంటైన్ కాలేదని లాఠీతో చితక బాదాడు. అడ్డొచ్చిన అతడి తల్లిని, తండ్రిని కూడా దుర్భాషలాడుతూ చితకబాది వీరంగం వేశాడు.

కొట్టోద్దని వేడుకుంటున్నా  వదలకుండా విచక్షణారహితంగా  కొట్టాడు. దీంతో ఆయువకుడు ఎస్సై తీరుపై మండి పడ్డాడు.  ఎస్సై కిరణ్ కుమార్ యువకుడిని కొట్టే సీన్ మొత్తాన్ని స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్టు చేశారు. పెరవలి ఎస్సై కిరణ్ కుమార్ యువకుడిని కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో యూనిట్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం పెరవలి ఎస్సై కిరణ్ కుమార్ ను సస్పెండ్  చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  విదేశాలనుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ సెంటర్ కు తరలించాలే కానీ లాఠీ చార్జి చేయటం సరికాదని డీజీపీ గౌతం సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు ఉంటాయని డీజీపీ హెచ్చరించారు. 

Also Read | దూరదర్శన్ లో రామాయణం  పునః ప్రసారం