ఏపీ మహిళలూ అప్లై చేసుకోండి : వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటుకు నోటిఫికేషన్

వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 25 నియోజకవర్గాలకు డిసెంబర్ నెలాఖరు లోపు కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు ఏమైనా ఉంటే వారం రోజుల్లోగా తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది.
గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు 191 ఉండగా వాటిని సీఎం జగన్ ప్రభుత్వం 216కు పెంచింది. ఈ 216 కమిటీల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించగా..అన్ని విభాగాల్లోనూ మహిళలకు రిజర్వేషన్లను కూడా కల్పించింది.
వ్యవసాయ మార్కెట్ కమిటీల పునర్విభజనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం ఒక మార్కెట్ కమిటీ ఉండాలన్న లక్ష్యంతో కమిటీలను విభజిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వారం వ్య వధిలో వీటిపై అభ్యంతరాలు స్వీకరించి తుది ప్రకటనను వచ్చేవారం జారీ చేయనుంది. ఇప్పటికే మార్కెట్ కమిటీల రిజర్వేషన్లను ఖరారు చేసిన ప్రభుత్వం వాటి నియామకం లోపే పునర్విభజన చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది.