రాజధానిపై జగన్ తీరుతో ఆత్మహత్యలు : మోడీ, అమిత్ షాకు భారత హిందూ మహాసభ లేఖ
ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధులు లేఖ రాశారు. రాజధానులను మార్చడం ద్వారా సీఎం జగన్ విపరీత పోకడలకు నాంది పలికారని తెలిపారు.

ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధులు లేఖ రాశారు. రాజధానులను మార్చడం ద్వారా సీఎం జగన్ విపరీత పోకడలకు నాంది పలికారని తెలిపారు.
ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధులు లేఖ రాశారు. రాజధానులను మార్చడం ద్వారా సీఎం జగన్ విపరీత పోకడలకు నాంది పలికారని తెలిపారు. రైతులు, మహిళలు, చిన్నారులు తమ నిరసనలను తెలుపుతున్నారని పేర్కొన్నారు. పోలీసులు, ఇతర వ్యవస్థలతో జగన్ ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. జగన్ తీరుతో స్థానికులు కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ వేధింపులను అడ్డుకునేందుకు, ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఒక పరిశీలన బృందాన్ని కేంద్రం నుంచి పంపాలని అభ్యర్థించారు.
రాజధాని రైతుల ఆందోళనలు 25 వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో రైతుల మహాధర్నాలు చేపట్టారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో 25వ రోజు రైతు రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో వివిధ గ్రామాలకు రైతులు నిరసన తెలుపుతున్నారు. మహిళలు పూజలు, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇతర రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు తెలుపుతున్నారు.
29 గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ రైతులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మందడం నుంచి విజయవాడ గుణదల వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. అన్ని గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరించారు. పోలీసులు అడ్డుకుంటే ఎక్కడికక్కడ నిరసనలు తెలిపాలని రైతులు నిర్ణయించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ప్రజా సంఘాల ఆందోళనలు చేపట్టాయి.
రాజధానిలో ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నాయి. 25 వ రోజు నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రకటన, GN RAO కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయాయి. 25 రోజులుగా ఎక్కడికక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు.
ఈ సందర్భంగా మహిళలపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును పలువురు ఎండగడుతున్నారు. అమరావతిలో మహిళా రైతులపై దాడి ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. అమరావతికి నిజనిర్ధారణ కమిటీని పంపించనున్నట్లు ఈ మేరకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ ట్వీట్ చేశారు.