టార్గెట్ జగన్ : మరో యాత్రకు చంద్రబాబు రెడీ
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారట.

ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారట.
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారట. 45 రోజుల పాటు ఈ యాత్రకు చంద్రబాబు ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. పార్టీ మీటింగ్ లో చంద్రబాబు ఈ మేరకు ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ఏపీలోని 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, మూడు రాజధానులు, పెట్టుబడుల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. వారికి చేరువయ్యేందుకు చంద్రబాబు బస్సు యాత్రకు ప్లాన్ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కూడా ఈ యాత్ర ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. ప్రభుత్వ తప్పిదాలపై ప్రజల్లో చైతన్యం తేవడానికి జన చైతన్య యాత్ర చేద్దామని చంద్రబాబు పార్టీ నేతలతో అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ యాత్ర చేయాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారట.
జగన్ ప్రభుత్వం తీసుకున్న రాజధాని వికేంద్రీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూడు రాజధానులతో ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని వాదిస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు రాజధాని ప్రాంత రైతులు కూడా అమరావతి రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్నారు. 50 రోజులకుపైగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
ప్రభుత్వం మాత్రం.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అంటోంది. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని చెబుతున్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందింది. అమరావతిని లెజిస్లేటివ్ కేపిటల్ గా, విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా, కర్నూలుని జ్యుడీషియరీ కేపిటల్ గా చేయాలని జగన్ నిర్ణయించారు. రాజధాని అంశంతో పాటు సంక్షేమ పథకాల్లో ప్రజలకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేసిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు.
* చంద్రబాబు మరో యాత్ర
* బస్సు యాత్రకు చంద్రబాబు ప్లాన్
* ఫిబ్రవరి 17 నుంచి టీడీపీ నేతల ప్రజా చైతన్య యాత్ర
* 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు యాత్ర
* ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ ల నేతృత్వంలో యాత్ర
* ప్రభుత్వ వైఫల్యాలు, పెట్టుబడులు, మూడు రాజధానులపై ప్రజా చైతన్య యాత్ర