ఏపీ పోలీసులు వైసీపీలో చేరిపోండి: చంద్రబాబు

ఏపీ పోలీసులపై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా..ప్రతొక్కరి జాతకాలు తెలుసు..మంచికి మంచిగా ఉంటా..తమషా చేయాలని అనుకొంటే సాధ్యం కాదని పోలీసు వ్యవస్థకు చెబుతున్నా అంటూ వ్యాఖ్యానించారు. విశాఖపట్టణంలో టీడీపీ కార్యకర్తలు చేపట్టిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై ఆయన స్పందించారు. జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో బాబు పాల్గొని ప్రసంగించారు.
పోలీసుల్లో అందరూ చెడ్డవాళ్లు ఉండరని, కొంతమంది మాత్రం ఎక్స్‌ట్రా వేషాలు వేస్తున్నారంటూ కామెంట్ చేశారు. మీరు కావాలంటే వైసీపీలో చేరిపోవచ్చని సలహా ఇచ్చారు. తనకు బాధ లేదని, పోలీసు వ్యవస్థ అనేది లా అండ్ ఆర్డర్ మెంటేన్ చేయాలి, ప్రజల ఆస్తులను రక్షించాలి..కానీ ఏకపక్షంగా వెళుతున్నారంటూ చెప్పారు. తన జీవితంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేయలేదని, నాలుగు నెలల కాలంలో 12 మంది టీడీపీ కార్యకర్తలను చంపేశారని ఆరోపించారు. 570 దాడులు చేశారని, పల్నాడులో ఊర్లకు ఊర్లు ఖాళీ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారని తెలిపారు.
కోడెల శివప్రసాద్‌పై దారుణంగా ప్రవర్తించారని, 27 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అన్నారు. ఆయనపై కేసులు పెట్టారని, 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే విధంగా సెక్షన్లు వేశారని తెలిపారు. తనకు ఈ విషయం తెలియదని, మానసిక క్షోభ పెట్టారని..చివరకు తనువు చాలించాడన్నారు. కార్యకర్తలు ఎవరూ భయపడడం లేదని, నాయకులు అండగా ఉంటి..సమిష్టిపోరాడితే..పులివెందులకు జగన్ పారిపోవడం ఖాయమన్నారు బాబు.
Read More : విశాఖకు బాబు : ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తత