ఢిల్లీపై యుద్ధం: విజయవాడలో సీఎం చంద్రబాబు ధర్నా
ఎన్నికలవేళ చంద్రబాబు విజయవాడ నడిబొడ్డున ధర్నా చేసేందుకు సిద్దం అయ్యారు.

ఎన్నికలవేళ చంద్రబాబు విజయవాడ నడిబొడ్డున ధర్నా చేసేందుకు సిద్దం అయ్యారు.
ఎన్నికలవేళ చంద్రబాబు విజయవాడ నడిబొడ్డున ధర్నా చేసేందుకు సిద్దం అయ్యారు. టీడీపీ నేతలపై కక్షపూరితంగా కేంద్రంలోని మోడీ సర్కార్ ఐటీ దాడులు చేయిస్తుందంటూ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఏపీ సీఎం చంద్రబాబు దీక్షకు దిగుతున్నారు. పలువురు టీడీపీ నాయకులపై ఐటీ, ఈడీ అధికారుల దాడులు జరగడాన్ని రాజకీయ కక్షగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఇటీవలకాలంలో టీడీపీ అభ్యర్థులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, నారాయణ విద్యా సంస్థలు, తదితర ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. వైసీపీతో కుమ్మక్కయిన బీజేపీ, ఈసీని వాడుకుని దాడులు చేయిస్తోందని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర సంస్థల దాడులకు నిరసనగా ధర్నా చెయ్యాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
Read Also : లక్ష్మీ పార్వతిపై లైంగిక వేధింపుల కేసు నమోదు