పవన్ కళ్యాణ్‌కి అత్తారింటికి పోవడమే తెలుసు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటున్న వేళ రాజకీయపార్టీలు నాయకులు విమర్శన అస్త్రాలను పెంచారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటున్న వేళ రాజకీయపార్టీలు నాయకులు విమర్శన అస్త్రాలను పెంచారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటున్న వేళ రాజకీయపార్టీలు నాయకులు విమర్శన అస్త్రాలను పెంచారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన వ్యూహం మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి జనసేన పార్టీని, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఎక్కువగా విమర్శించని చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌పై విమర్శలను పెంచారు.
Read Also : జగన్‌కు బిస్కెట్లు వేస్తే కుక్కలా విశ్వాసం చూపుతున్నాడు
చిత్తూరు జిల్లా మదనపల్లె బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అత్తారింటికి పోవడం తప్ప.. ఏం తెలీదు అంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌ని నమ్ముకుంటే అత్తారింటికి పోవడం తప్ప ఏమీ చేయలేడని, కోడికత్తి పార్టీలను నమ్ముకుంటే జైళ్లకు పోతారంటూ చురకలు అంటించారు. తనను నమ్ముకుంటే భవిష్యత్తుకు భరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. మీ భవిష్యత్తు.. నా బాధ్యత అన్నారు.
Read Also : బిగ్ బ్రేకింగ్ : మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష
పవన్ కల్యాణ్ పై ఈస్థాయిలో వ్యక్తిగత విమర్శలకు చంద్రబాబు దిగటం ఇదే మొదటిసారి. గతంలో సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు కానీ.. ఈసారి ఏకంగా అత్తారింటికి పోవటమే తెలుసు అంటూ పవన్ పెళ్లిళ్ల విషయాన్ని పరోక్షంగా విమర్శిస్తూ.. ఎదురుదాడి చేయటం కలకలం రేపుతోంది.