ప్రధాన మంత్రి మోడీకి సీఎం జగన్ లేఖ

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను వణికిస్తుంది. ఇప్పటికే వేల మందికి ఈ వైరస్ సోకగా.. ఎందరో చనిపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే చైనాలో హెల్త్ ఎమర్జన్సీని కూడా ప్రకటించింది ప్రభుత్వం.
ఈ క్రమంలోనే చైనాలోని వూహాన్ సిటీలో చిక్కుకున్న 35 మంది ఏపీ యువకులను తిరిగి రప్పించేలా చర్యలు చేపట్టాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ఆప్టో డిస్ల్పే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎంపికయిన 35 మంది యువకులను శిక్షణ కోసం సంస్థ చైనా పంపడంతో అక్కడే యువకులు శిక్షణ పొందుతున్నారని, వూహాన్ సిటీలో కరోనా వైరస్ విజృంభిస్తోండడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని వారిని వెనక్కి తీసుకుని వచ్చేందుకు కృషి చెయ్యాలని సీఎం వైఎస్ జగన్ లేఖలో కోరారు. వీలైనంత త్వరగా వారిని భారత్‌కు చేర్చేందుకు ఏర్పాట్లు చెయ్యాలని కోరారు.