వరంగల్..భువనగిరిలో KCR ప్రచారం
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో TRS దూసుకపోతోంది. ఆ పార్టీ అభ్యర్థులు, కీలక లీడర్స్ ఆయా నియోజక వర్గాల్లో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో TRS దూసుకపోతోంది. ఆ పార్టీ అభ్యర్థులు, కీలక లీడర్స్ ఆయా నియోజక వర్గాల్లో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో TRS దూసుకపోతోంది. ఆ పార్టీ అభ్యర్థులు, కీలక లీడర్స్ ఆయా నియోజక వర్గాల్లో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు. కొద్ది రోజుల తరువాత నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంతో కేసీఆర్ మరలా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ లో ప్రచారం నిర్వహించారు.
Read Also : పవన్ కళ్యాణ్‌కి అత్తారింటికి పోవడమే తెలుసు
ఆయా సభల్లో ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు కౌంట్ ఇస్తున్నారు. గందరగోళ పడొద్దని.. ఆనాటి పరిస్థితులు.. ఇప్పుడున్న పరిస్థితులను బేరీజు వేసుకుని ఓటు వేయాలని సూచిస్తున్నారు. భారతేదేశంలో గుణాత్మక మార్పు అవసరమని నొక్కి చెబుతున్నారు గులాబీ బాస్.
ఏప్రిల్ 02వ తేదీ మంగళవారం వరంగల్, భువనగిరిలలో నిర్వహించే ప్రచార సభలలో కేసీఆర్ పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు అజంజాహి మిల్స్ మైదానంలో సభ జరుగనుంది. ఈ సభలో ప్రసంగించిన అనంతరం నేరుగా భువనగిరికి గులాబీ దళపతి చేరుకోనున్నారు. అక్కడ నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. అనంతరం భువనగిరిలో జరిగే సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
Read Also : జగన్‌కు బిస్కెట్లు వేస్తే కుక్కలా విశ్వాసం చూపుతున్నాడు
ఏప్రిల్ 03వ తేదీన అందోల్ లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. అదే రోజు నర్సాపూర్ లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. ఏప్రిల్ 04వ తేదీన మహబూబాబాద్, ఖమ్మంలో కేసీఆర్ పాల్గొని సభల్లో ప్రసంగిస్తారు. కేసీఆర్ ఎన్నికల సభలతో తెలంగాణ పొలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి.
Read Also : బిగ్ బ్రేకింగ్ : మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష