ఏపీలో మైక్ లు బంద్…ఓటరు దేవుడు ఎవరివైపు
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం(ఏప్రిల్-9,2019)సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మైక్ లు మూగబోయాయి.

ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం(ఏప్రిల్-9,2019)సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మైక్ లు మూగబోయాయి.
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం(ఏప్రిల్-9,2019)సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మైక్ లు మూగబోయాయి. నెల రోజులుగా ప్రధాన పార్టీలు ఢీ అంటే ఢీ కొట్టాయి. ప్రచారం హోరెత్తించాయి. విమర్శలు, ఆరోపణలతో దుమ్మెత్తిపోసుకున్నారు. సుడిగాలి పర్యటనలు చేశారు. సమయం తక్కువగా ఉండటంతో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన అధినేతలు హెలికాఫ్టర్లను ఉపయోగించారు. రోజుకు నాలుగైదు నియోజకవర్గాలను కవర్ చేస్తూ పబ్లిక్ మీటింగ్ లు నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఈ ఎన్నికల ప్రచారంలో స్టయిల్ మార్చారు. రోడ్ షో ప్రసంగాల్లో మైక్రో హెడ్ ద్వారా మాట్లాడుతూ అందరినీ ఎట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నించారు.
Read Also : లక్ష్మీపార్వతి జోస్యం : వైసీపీకి 125 ఎమ్మెల్యే , 22 ఎంపీ సీట్లు ఖాయం
బాడీ లాంగ్వేజ్ మార్చారు. తీవ్ర పదజాలంతో విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై ఎక్కువగా విమర్శలు చేశారు. జనసేన అధినేతనూ వదల్లేదు. చివరి రెండు రోజుల్లో టీడీపీ ప్రచారంలో నారా బ్రాహ్మణి హైలెట్ గా నిలిచింది. మంగళగిరిలో పోటీ చేస్తున్న భర్త నారా లోకేష్ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో టీడీపీ క్యాంపెయిన్ లో సినీ తారలు కనిపించేవాళ్లు. ఈసారి మాత్రం టీడీపీ క్యాంపెయిన్ లో సినీతారలు పాల్గొనకపోవడం అందరినీ అవాక్కయేలా చేసింది. చంద్రబాబు ఒక్కరే టీడీపీ అన్నట్లుగా.. ఆ పార్టీ క్యాంపెయిన్ చేసింది. జాబు రావాలంటే మళ్లీ మళ్లీ బాబే రావాలి అన్న నినాదంతో ప్రచారం హోరెత్తించింది టీడీపీ.
ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా రోజుకు నాలుగైదు పబ్లిక్ మీటింగ్స్ లు నిర్వహించారు. చంద్రబాబు, పవన్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి పబ్లిక్ మీటింగ్ లో మేనిఫెస్టోలోని నవరత్నాలను హైలెట్ చేస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పించటానికి ప్రయత్నించారు. ముఖ్యం వైసీపీ నినాదం అయిన రావాలి జగన్ – కావాలి జగన్ ఈ ఎన్నికల క్యాంపెయిన్ లో అందరినీ ఎట్రాక్ట్ చేసింది. వైసీపీ తరపున విజయమ్మ, షర్మిళ క్యాంపెయిన్ నిర్వహించారు. సినీ నటులు తనీష్, అలీ వంటి వారు వైసీపీ తరపున ప్రచారం చేశారు. పులివెందుల నుంచే మరోసారి జగన్ పోటీ చేస్తున్నారు.
మార్పు కోసం అంటూ తొలిసారిగా ఏపీ ఎన్నికల బరిలో దిగింది జనసేన. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చిన జనసేన.. ఈసారి ఒంటరిగా బరిలోకి దిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో రోజుకు నాలుగైదు పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొన్నారు. ఆవేశపూరిత ప్రసంగాలతో ఓటర్లను ఎట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రచారం నిర్వహించారు.
Read Also : కేసీఆర్ ఖబడ్దార్.. నోరు అదుపులో పెట్టుకో : చంద్రబాబు
వైసీపీనే ప్రత్యర్థిగా భావిస్తామని పవన్ స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. నరసాపురం పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగబాబు తరపున ఆయన కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాల్గొన్నారు. ప్రచారం చివరిరోజున జనసేన బహిరంగ సభలో పాల్గొని స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలు గాజువాక,భీమవరం నుంచి పవన్ పోటీ చేస్తున్నారు.
ఈ ఎన్నికలకు సంబంధించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. తన వ్యూహాలతో వైసీపీని పాల్ ముప్పుతిప్పలు పెట్టాడు. వైసీపీ ఎన్నికల గుర్తును పోలిన గుర్తును కలిగి ఉండటం, వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలి ఉండే పేర్లు ఉన్న అభ్యర్థులను 35 స్థానాల్లో బరిలోకి దించి వైసీపీకి చెమటలు పట్టేలా చేశాడు. తన హావ భావాలు, చేష్టలతో నవ్వించాడు పాల్. ఏపీకి కాబోయే సీఎం నేనే అంటూ కామెడీ చేస్తూ ఓటర్లలో ఎన్నికల వేడిని తగ్గించారు. ప్రజలు హాయిగా కాసేపు నవ్వుకునే విధంగా జోకులు వేస్తూ ఎట్రాక్ట్ చేశారు. పాల్ రావాలి..పాలన మారాలి అంటూ తనదైన శైలిలో వైసీపీ, టీడీపీ, జనసేనలపై విమర్శలు చేశారు కేఏ పాల్. నర్సాపురం పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థిగా పాల్ పోటీ చేస్తున్నారు.
జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రచారం తూతూమంత్రంగానే సాగిందని చెప్పవచ్చు. బీజేపీ తరపున ప్రధాని మోడీ ఏపీలో బహిరంగ సభల్లో పాల్గాన్నారు. కమలదళంలో నాయకత్వ లేమి ఆ పార్టీకి శాపంగా మారిందని చెప్పవచ్చు. విభజనకు కారణమై కంచుకోట ఏపీని చేజార్చుకున్న కాంగ్రెస్ ప్రచారం కూడా తూతూమంత్రంగా సాగింది.
ఏప్రిల్-11, 2019న ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మే-23, 2019న ఫలితాలు వెలువడనున్నాయి.
Read Also : వైసీపీకి అడ్రస్ ఉండదు.. డిపాజిట్ కూడా దక్కదు