విశాఖలో పవన్ ర్యాలీ : ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై విమర్శలు

విశాఖలో ర్యాలీ నిర్వహించాలని జనసేనానీ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. నవంబర్ 03వ తేదీన ర్యాలీ నిర్వహించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహించనుంది. ఉపాధి దొరక్క కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి మద్దుతుగా ఉండాలని జనసేన నిర్ణయం తీసుకుంది. కానీ ర్యాలీ ఎక్కడి నుంచి ప్రారంభించాలి..ఎక్కడ ఎండ్ చేయాలనే దానిపై కమిటీ నిర్ణయం తీసుకోలేదు. స్థానికంగా ఉన్న నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనునున్నారు.
అక్టోబర్ 20వ తేదీ ఆదివారం జనసేన రాష్ట్ర కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై జనసేనానీ పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులను తొలగించాలనే నిర్ణయం అప్రజాస్వామికమన్నారు. ఏపీలో 2.5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలనే సీఎం జగన్ నిర్ణయం దారుణమని వ్యాఖ్యానించారు. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతుంటే..ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని సూచించారు.
Read More :