గెలిస్తే ఏం చేస్తానంటే : గాజువాక నియోజకవర్గ జనసేన మేనిఫెస్టో

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తాను పోటీ చేస్తోన్న గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు.

  • Published By: madhu ,Published On : March 31, 2019 / 01:34 AM IST
గెలిస్తే ఏం చేస్తానంటే : గాజువాక నియోజకవర్గ జనసేన మేనిఫెస్టో

Updated On : March 31, 2019 / 1:34 AM IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తాను పోటీ చేస్తోన్న గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తాను పోటీ చేస్తోన్న గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను చేయబోయే కార్యక్రమాలను మేనిఫెస్టోలో పొందుపర్చారు. ఇతర పార్టీలకంటే భిన్నంగా నియోజకవర్గ మేనిఫెస్టో విడుదల చేసి.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు పవన్. మార్చి 30వ తేదీ శనివారం పవన్‌ కల్యాణ్‌ గాజువాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార రోడ్‌షో నిర్వహించారు. గాజువాక పరిధిలోని అగనంపూడి శివాలయం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా 64 అంశాలతో కూడిన గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
Read Also : యజమానికే ఝలక్: ఫేస్‌బుక్‌లో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ పోస్ట్‌లనే తీసేశారు

గాజువాక నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని.. జనసేన గెలిచిన తర్వాత అగనంపూడిని రెవెన్యూ డివిజన్‌ చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నో సమస్యలు ఉన్న ఈ నియోజకవర్గాన్ని గత పాలకులంతా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అందుకే తాను గాజువాక నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పవన్‌ స్పష్టం చేశారు. గాజువాకలో ఇంటి పన్ను తగ్గిస్తానని పవన్‌ హామీనిచ్చారు. వృద్ధులకు ఆదరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాననన్నారు. తోపుడబండ్ల వ్యాపారులకు ఎలాంటి రుసుము లేకుండా వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.
Read Also : కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ

తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్టు పవన్‌ తన నియోజకవర్గ మేనిఫెస్టోలో తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటానన్నారు.  గంగవరం పోర్టు కాలుష్యం నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తానని హామీనిచ్చారు. గాజువాకలో నైట్‌ షెల్టర్లు ఏర్పాటు చేస్తామని పవన్‌ హామీనిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని.. స్టీల్‌ప్లాంట్‌ వల్ల ఎవరైతే భూములు కోల్పోయారో వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖ ఉక్కు కోసం తమ జీవితాలను ఫణంగా పెట్టిన వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 
Read Also : సందట్లో సడేమియా : ప్రచారంలో షర్మిళ ఉంగరం చోరీ యత్నం