అమ్మకు కాఫీ ఇస్తునే జడ్జి మృతి..

కన్న తల్లికి కాఫీ ఇస్తునే వున్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిన 25 ఏళ్ల జడ్జి ఐశ్వర్య మృతి చెందారు. గుంటూరు జిల్లా వన్ టౌన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న న్యాయమూర్తి ఐశ్వర్య జనవరి 5 తేదీ ఉదయం అకస్మాత్తుగా కన్నుమూశారు.

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 06:12 AM IST
అమ్మకు కాఫీ ఇస్తునే జడ్జి మృతి..

కన్న తల్లికి కాఫీ ఇస్తునే వున్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిన 25 ఏళ్ల జడ్జి ఐశ్వర్య మృతి చెందారు. గుంటూరు జిల్లా వన్ టౌన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న న్యాయమూర్తి ఐశ్వర్య జనవరి 5 తేదీ ఉదయం అకస్మాత్తుగా కన్నుమూశారు.

గుంటూరు : కన్న తల్లికి కాఫీ ఇస్తునే వున్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిన 25 ఏళ్ల జడ్జి ఐశ్వర్య మృతి చెందారు. గుంటూరు జిల్లా వన్ టౌన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న న్యాయమూర్తి ఐశ్వర్య జనవరి 5 తేదీ ఉదయం అకస్మాత్తుగా కన్నుమూశారు. కోర్టుకెళ్లే క్రమంలో ఇంటి పనులు చక్కపెట్టుకుంటున్న క్రమంలో తల్లికి కాఫీ ఇస్తునే కుప్పకూలిపోయిన ఐశ్వర్యను కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే  ఆసుపత్రికి తరలించారు. ఆమెను టెస్ట్ చేసిన డాక్టర్స్ అప్పటికే ఆమె మరణించినట్లుగా తెలిపారు. జడ్జిగా పనిచేస్తు..కోర్టు బంగళాలోనే తల్లిదండ్రులతో కలిసి వుంటున్న ఐశ్వర్య 4 తేదీన ప్రమాదవశాత్తు  ఇంట్లో జారిపడ్డారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురి అయి కోలుకున్న ఆమె హఠాత్తుగా మరణించటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఐశ్వర్య కుటుంబాన్ని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్, పలువురు న్యాయవాదులు పరామర్శించారు.