ఆలీ…ఇదేనా స్నేహమంటే : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  హీరో కమ్ కమేడియన్ ఆలీ ఫిల్మ్  ఇండస్ట్రీలో మంచి స్నేహితులని అందరికీ  తెలుసు.

  • Published By: chvmurthy ,Published On : April 8, 2019 / 04:19 PM IST
ఆలీ…ఇదేనా స్నేహమంటే : పవన్ కళ్యాణ్

Updated On : April 8, 2019 / 4:19 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  హీరో కమ్ కమేడియన్ ఆలీ ఫిల్మ్  ఇండస్ట్రీలో మంచి స్నేహితులని అందరికీ  తెలుసు.

రాజమండ్రి : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  హీరో కమ్ కమేడియన్ ఆలీ ఫిల్మ్  ఇండస్ట్రీలో మంచి స్నేహితులని అందరికీ  తెలుసు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన పార్టీలో చేరతాడనుకున్నఆలీ , ఊహించని విధంగా వైయస్సార్ సీపీలో జాయిన్ అయి పార్టీ తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నాడు.  తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సోమవారం  ఎన్నికల ప్రచారం నిర్వహించిన  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలీపై విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 
Read Also : పవన్‌కళ్యాణ్‌కు ఆలీ కౌంటర్: ఏం సాయం చేశావ్?

తన స్నేహితుడు, ఆలీని నమ్మితే …. మోసం చేసి వెళ్ళిపోయాడని, ఆలీ సూచించిన వ్యక్తికే నరసరావు పేట ఎంపీ టికెట్ ఇస్తే…ఆలీ వైసీపీ కి ప్రచారం చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇదేనా స్నేహమంటే అని పవన్ ప్రశ్నించారు. ఆలీకి కష్టాలు వస్తే అండగా ఉన్నాను, ఆలీ కి ఏదైనా అవసరం వస్తే  అండగా ఉన్నాను.. ఐనా నన్ను వదిలివెళ్లిపోయాడని అన్నారు. అందుకే  నేను ఎవరినీ నమ్మను, అభిమానులనే నమ్ముతానని పవన్ అన్నారు.  నేను గెలవననే భయంతో ఆలీ వైసీపీ లో చేరి ఉంటాడని ఆయన అన్నారు. 
Read Also : మద్యం దుకాణాలు బంద్: అమ్మితే లైసెన్స్‌లు రద్దు