పీఎస్‌ఎల్వీ-సీ 44 ప్రయోగం విజయవంతం
పీఎస్‌ఎల్వీ-సీ 44 ప్రయోగం విజయవంతమైంది.

పీఎస్‌ఎల్వీ-సీ 44 ప్రయోగం విజయవంతమైంది.
నెల్లూరు : పీఎస్‌ఎల్వీ-సీ 44 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) నుంచి పీఎస్‌ఎల్వీ-సీ 44 రాకెట్ ను ప్రయోగించారు. విద్యార్థులు రూపకల్పన చేసిన కలాం శాట్‌ను, మైక్రోశాట్‌ను పీఎస్‌ఎల్వీ సీ 44 నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 46వ ప్రయోగం. సాధారణంగా పీఎస్‌ఎల్వీ వాహక నౌకకు నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లను ఏర్పాటు చేస్తారు. కానీ దీనిలో మాత్రం రెండు స్ట్రాపాన్ బూస్టర్లను మాత్రమే శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు.
ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో డైరెక్టర్ శివన్ ఆనందం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. ఈ సందర్భంగా శివన్ మాట్లాడుతూ.. దేశంలోని విద్యార్థులందరికీ ఇస్రో తలుపులు నిరంతరం తెరిచే ఉంటాయని, వారు రూపొందించే ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తుందని తెలిపారు. భారత్‌ను వైజ్ఞానిక ఆవిష్కరణల దేశంగా మార్చేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.